Air India Safety Issues: విమానాల్లో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:08 AM
క్యాబిన్ సిబ్బందికి విశ్రాంతి, శిక్షణ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినందుకు..

ఎయిరిండియాకు 4 నోటీసులు జారీ చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ, జూలై 24: క్యాబిన్ సిబ్బందికి విశ్రాంతి, శిక్షణ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినందుకు ఎయిరిండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఈ సంస్థకు జూలై 23న నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పైలట్లకు తగినంత విశ్రాంతి ఇవ్వకపోవడం, సిమ్యులేటర్‌పై శిక్షణ పొందాలన్న నిబంధనను పాటించపోవడం, శిక్షణ పొందని పైలట్లకు ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న విమానాశ్రయాలకు వెళ్లే విధులు కేటాయించడం, సరిపడా క్యాబిన్ సిబ్బంది లేకుండా అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించడం వంటి ఉల్లంఘనలను ఉదహరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News