Bombay High Court Divorce Ruling: భర్తతో శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే..
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:12 AM
భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలున్నాయని అతడిని అనుమానించడం క్రూరత్వం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు వెల్లడించింది.

ఆ కారణంతో విడాకులివ్వొచ్చు: బాంబే హైకోర్టు
ముంబై, జూలై 18: భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలున్నాయని అతడిని అనుమానించడం క్రూరత్వం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు వెల్లడించింది. ఈ కారణం కింద విడాకులు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాల్ చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. 2013లో సదరు జంటకు వివాహం కాగా.. మరుసటి ఏడాది నుంచే భర్తతో ఆమె విడిగా ఉంటోంది. దీంతో 2015లో ఆమె భర్త క్రూరత్వం కింద విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తాజాగా హైకోర్టులో విచారణ సందర్భంగా.. తనతో శృంగారానికి నిరాకరించడంతో పాటు వివాహేతర సంబంధాలున్నాయని భార్య పదే పదే అనుమానించేదని సదరు భర్త పేర్కొన్నాడు. తనను విడిచి పుట్టింటికి వదిలి వెళ్లినప్పట్నుంచి అసలు పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చాడు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆ జంట మధ్య వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందంటూ మహిళ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి