Rajnath Singh: డీలిమిటేషన్‌తో సీట్ల సంఖ్యపై రాజ్‌నాథ్ క్లారిటీ
ABN , Publish Date - Mar 11 , 2025 | 09:21 PM
డీలిమిటేషన్ ప్రక్రియ ప్రణాళికా బద్ధంగా కొనసాగుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఎంకే స్టాలిన్‌కు దీనిపై ఏదైనా అభ్యంతరం ఉంటే వాటిని లేవనెత్తే స్వేచ్ఛ ఆయనకు ఉంటుందని అన్నారు.

న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన (Delimitaion) వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, పార్లమెంటు సీట్ల సంఖ్య తగ్గుతుందని జరుగుతున్న చర్చపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. డీలిమిటేషన్‌తో తమిళనాడుతో సహా అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరుగుతుందని ఆయన అన్నారు.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని రెండు సంస్థలను నిషేధించిన కేంద్రం
ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, డీలిమిటేషన్ ప్రక్రియ ప్రణాళికా బద్ధంగా కొనసాగుతుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఎంకే స్టాలిన్ (తమిళనాడు సీఎం)కు ఏదైనా అభ్యంతరం ఉంటే వాటిని లేవనెత్తే స్వేచ్ఛ ఆయనకు ఉంటుందని అన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్చలు జరుపుతారని, నిర్ణయం న్యాయంగానే ఉంటుందని చెప్పారు.
శాసనసభ అయినా, లోక్‌సభ అయినా ప్రతి రాష్ట్రంలోనూ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సీట్ల సంఖ్య సహజంగానే పెరుగుతుందని అన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో కూడా సీట్లు పెరుగుతాయని, నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే ప్రయోజనం పొందుతాయనడం సరైన వాదన కాదని రాజ్‌నాథ్ చెప్పారు. డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించాలంటూ ఏడుగురు ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి
Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశం
Land For Job Scam Case: లాలూ తనయుడు తేజ్‌ప్రతాప్, కుమార్తె హేమకు బెయిల్
Ranya Rao: రన్యారావుకు పొలిటికల్ లింక్స్.. దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్
Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.