Phone Snatching: ఫోన్ దొంగతనం.. కట్ చేస్తే భార్య ఎఫైర్ బయటపడింది..
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:44 AM
Phone Snatching: ఫోన్ దొంగతనానికి గురవ్వటంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ఏరియాలో 70 సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించారు.

‘అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి.. బోల్తా కొట్టిందిలే...’ అని ఓ పాట ఉంటుంది. ఓ మహిళ విషయంలోనూ అదే జరిగింది. తన ఎఫైర్‌ను దాచి పెట్టడానికి ఆమె తన భర్త ఫోన్‌ను దొంగతనం చేయించింది. తను సేఫ్ అనుకుంది. అయితే, అనుకోని విధంగా చివరకు దొంగతనం కేసులో ఇరుక్కుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ళ క్రితం పెళ్లయింది. ఆమె గతకొంత కాలం నుంచి వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. తన ఫోన్‌లో ప్రియుడితో కలిసి ఉన్న ఫొటోలు దాచి పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసింది.
భార్య నిద్రలో ఉండగా ప్రియుడితో ఆమె దిగిన ఫొటోలను తన ఫోన్‌కు పంపుకున్నాడు. ఈ విషయం ఆమెకు తెలిసింది. భర్త ఆ ఫోటోలను తన కుటుంబసభ్యులకు చూపిప్తే పరువుపోతుందని ఆమె భావించింది అందుకే ఓ ప్లాన్ వేసింది. అతడి ఫోన్‌ను దొంగిలించడానికి అంకిత్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చింది. జూన్ 19వ తేదీన మహిళ భర్త రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అంకిత్ అద్దె స్కూటీ మీద మరో వ్యక్తితో మహిళ భర్తను ఫాలో అయ్యాడు. ఓల్డ్ యూకే పెయింట్ ఫ్యాక్టరీ దగ్గర ఫోనును దొంగలించాడు.
ఫోన్ దొంగతనానికి గురవ్వటంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ఏరియాలో 70 సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించారు. స్కూటీ నెంబర్ సంపాదించారు. స్కూటీ అద్దెకు ఇచ్చిన షాపు దగ్గరకు వెళ్లారు. షాపు వాళ్లు అంకిత్ ఆధార్, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆధార్, ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాకు వెళ్లారు. అంకిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ ఫోన్‌లో ఉన్న ఫొటోలు డిలీట్ చేయడానికి భార్య డబ్బులు ఇచ్చి దొంగతనం చేయించిందని అంకిత్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి
ఈసీ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ..!!
రీసెర్చ్ సెంటర్ ప్రాంగణంలో చిరుతల కలకలం