Delhi bomber: ఆత్మాహుతి అంటే బలిదానం.. వెలుగులోకి ఢిల్లీ పేలుళ్ల నిందితుడి సెల్ఫీ వీడియో..
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:14 AM
ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేల్చడానికి వారం రోజుల ముందు నబీ కశ్మీర్‌లోని పుల్వామాలో తన ఇంటికి వెళ్లి సోదరుడు జహూర్ ఇలాహాకి ఆ వీడియో ఉన్న మొబైల్ ఫోన్ ఇచ్చాడు. నబీ స్నేహితులు అరెస్ట్ అయిన తర్వాత అతడి సోదరుడు ఆ ఫోన్‌ను ఓ చెరువులోకి విసిరేశాడు
ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్-ఉన్-నబికి సంబంధించిన సంచలన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేల్చడానికి వారం రోజుల ముందు నబీ కశ్మీర్‌లోని పుల్వామాలో తన ఇంటికి వెళ్లి సోదరుడు జహూర్ ఇలాహాకి ఆ వీడియో ఉన్న మొబైల్ ఫోన్ ఇచ్చాడు (Delhi bomber Pulwama visit).
జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నబీ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయానికి వచ్చే ముందు తన రెండు ఫోన్‌లలో ఒకదాన్ని తన సోదరుడికి అప్పగించాడని తెలుస్తోంది. ఆ ఫోన్‌లో నబీ ఆత్మహుతి దాడులకు ప్రేరేపించేలా రూపొందించిన వీడియో ఉంది. ఆత్మాహుతికి పాల్పడడాన్ని బలిదానంగా నబీ ఆ వీడియోలో అభివర్ణించాడు. ఒకవేళ తన గురించి ఏమైనా వార్తలు వస్తే ఆ మొబైల్ ఫోన్ ఎవరికీ దొరక్కుండా నీళ్లలోకి విసిరేయాలని సోదరుడు జహూర్ ఇలాహాకి చెప్పాడు (Red Fort explosion).
నబీ స్నేహితులు అరెస్ట్ అయిన తర్వాత అతడి సోదరుడు ఆ ఫోన్‌ను ఓ చెరువులోకి విసిరేశాడు (bomber left phone). పోలీసుల విచారణలో ఆ మొబైల్ ఫోన్ గురించి ఇలాహీ చెప్పాడు. చెరువు నుంచి ఆ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ పాడైనప్పటికీ అందులోని కీలక డేటాను ఫోరెన్సిక్ నిపుణులు వెలికితీయగలిగారు. దర్యాఫ్తు కోసం ఆ మొబైల్‌ను జాతీయ దర్యాఫ్తు సంస్థకు అప్పగించారు. నబీ సోదరుడు ఇలాహీని కూడా అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News