Cryptocurrency Hacking: ఈ ఏడాది ప్రథమార్థంలో రూ.18,662 కోట్ల క్రిప్టోల చౌర్యం
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:52 AM
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోల దొంగతనాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశీయ క్రిప్టో..

న్యూఢిల్లీ, జూలై 21: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోల దొంగతనాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశీయ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ కాయిన్‌డీసీఎక్స్‌పై గతవారం దాడి చేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా 4.42 కోట్ల డాలర్ల (సుమారు రూ.378 కోట్లు) క్రిప్టో కరెన్సీలను దొంగిలించారు. దీనికన్నా ముందు.. ఈ ఏడాది ప్రథమార్ధం(జనవరి-జూన్)లో ప్రపంచవ్యాప్తంగా 217 కోట్ల డాలర్ల (రూ.18,662 కోట్లు) క్రిప్టో దొంగతనాలు జరిగాయి. ఈ విషయాన్ని బ్లాక్ చెయిన్ అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ చైనాలిసిస్ నివేదిక వెల్లడించింది. బైబిట్ ఎక్స్ఛేంజ్‌లో జరిగిన 150 కోట్ల డాలర్ల చోరీ ఇప్పటివరకు క్రిప్టో పరిశ్రమ చరిత్రలోనే అత్యధికమని, ఈ ఏడాదిలో జరిగిన మొత్తం క్రిప్టో దొంగతనాల్లో 69 శాతానికి సమానమని రిపోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా, సైబర్ దాడిలో నష్టపోయిన 4.42 కోట్ల డాలర్లను రికవరీ చేసుకునేందుకు కాయిన్‌డీసీఎక్స్ నజరానా ప్రకటించింది. ఈ దొంగతనానికి పాల్పడిన వారి జాడ తెలిపిన లేదా రికవరీకి తోడ్పడే సమాచారం అందించిన వారికి తిరిగి రాబట్టిన సొత్తులో 25ు ఇస్తామని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News