Share News

MBBS Daughter: ఇంటర్ చదివిన వ్యక్తితో MBBS కూతురి ప్రేమ.. సహించలేకపోయిన తండ్రి

ABN , Publish Date - Apr 29 , 2025 | 09:11 PM

MBBS Daughter: కిరణ్ కూతురు త్రిప్తి ఎంబీబీఎస్ చదివింది. ఆమెకు అవినాష్ వాగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం త్రిప్తి ఇంట్లో తెలిసింది. అవినాష్ ఇంటర్ మాత్రమే చదవటంతో కిరణ్ వారి పెళ్లికి ఒప్పుకోలేదు.

MBBS Daughter: ఇంటర్ చదివిన వ్యక్తితో MBBS కూతురి ప్రేమ.. సహించలేకపోయిన తండ్రి
MBBS Daughter

ప్రేమ ఎప్పుడు.. ఎవరి మధ్య పుడుతుందో చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. నిజంగా మనం ఓ మనిషిని ప్రేమిస్తే వారిలోని లోపాలు మనకు కనిపించవు. రాజు, పేద.. నలుపు, తెలుపు.. లావు, సన్నం.. ఏదీ అడ్డుకాదు. సీతారామం సినిమాలో చూపించినట్లు .. ఓ రాజ్యానికి యువరాణి అయినా.. ప్రేమించిన వాడి కోసం అన్నిటినీ వదులుకుంటుంది. అది సినిమానే కావచ్చు.. నిజ జీవితంలోనూ అలాంటి ఘటనలు జరిగాయి. తాజాగా, ఎంబీబీఎస్ చదివిన ఓ అమ్మాయి.. ఇంటర్ చదివిన అబ్బాయిని ప్రేమించింది. అతడి కోసం కుటుంబాన్నే ఎదురించింది.


అందరినీ కాదని అతడితో వెళ్లిపోయింది. పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తోంది. ఇలాంటి సమయంలో తండ్రి రాక్షసుడిలా మారాడు. కూతుర్ని తుపాకితో కాల్చి చంపేశాడు. అల్లుడిపై కూడా కాల్పులు జరిపి గాయపరిచాడు. ఈ సంఘటన నార్త్ మహారాష్ట్రలోని చోప్డ తెహ్సిల్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో ఆ తండ్రి కూతుర్ని ఎందుకు చంపాడో తేలింది. పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ వివరాల్లోకి వెళితే.. నార్త్ మహారాష్ట్ర, చోప్డ తెహ్సిల్‌కు చెందిన కిరణ్ మంగ్లే సీఆర్‌పీఎఫ్‌లో పని చేసి రిటైర్డ్ అయ్యాడు.


కిరణ్ కూతురు త్రిప్తి ఎంబీబీఎస్ చదివింది. ఆమెకు అవినాష్ వాగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం త్రిప్తి ఇంట్లో తెలిసింది. అవినాష్ ఇంటర్ మాత్రమే చదవటంతో కిరణ్ వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో త్రిప్తి ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. అవినాష్‌ను పెళ్లి చేసుకుంది. ఎంబీబీఎస్ చదివిన త్రిప్తి.. ఇంటర్ చదివిన వాడ్ని పెళ్లి చేసుకోవటం కిరణ్‌కు నచ్చలేదు. ఆమె మీద పగబట్టాడు. శనివారం అవినాష్, త్రిప్తిలు అవినాష్ చెల్లెలి హల్దీ ఫంక్షన్‌కు వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ వారిని అడ్డగించాడు. తన తుపాకితో వారిపై కాల్పులు జరిపాడు.


త్రిప్తి అక్కడికక్కడే చనిపోయింది. అవినాష్ గాయపడ్డాడు. అక్కడే ఉన్న జనం వెంటనే కిరణ్‌పై దాడి చేశారు. వారి దాడిలో కిరణ్ కూడా గాయపడ్డాడు. అవినాష్, కిరణ్‌లను ఆస్పత్రికి తరలించారు. కిరణ్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. అవినాష్ తల్లి కిరణ్‌తో పాటు అతడి కొడుకుపై కూడా పోలీసులకు ఫిర్యాాదుచేసింది. ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

Jammu and Kashmir: లోయలో పడ్డ సీఆర్‌పీఎఫ్ వాహనం.. ఇద్దరి పరిస్థితి విషమం..

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. పిల్లాడి ఆకలి ఆ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడింది

Updated Date - Apr 29 , 2025 | 09:57 PM