Maoist Document: వెలుగులోకి మావోయిస్ట్ డాక్యుమెంట్.. కీలక అంశాలు ఇవే..
ABN , Publish Date - Dec 15 , 2025 | 09:18 PM
మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో 2024 ఏడాది విడుదల చేసిన ఓ డాక్యుమెంట్ లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు భద్రతా దళాల అణచివేతపై చర్యలు, పార్టీలో పెరుగిపోతున్న లొంగుబాట్ల నేపథ్యంలో ఈ ప్రకటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డాక్యుమెంట్ను ఆగస్టు 2024 న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు పోలిట్ బ్యూరో పంపినట్లు తెలుస్తుంది.
మావోయిస్ట్ పార్టీ (CPI-Maoist) పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ డాక్యుమెంట్లోని కీలక అంశాలు విషయానికి వస్తే.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) అణిచివేత చర్యలను ఖండించాలి. ఈ ఆపరేషన్స్ వల్ల నిరపరాధులైన ఆదివాసీల జీవితాలకు ముప్పు వాటిల్లుతుంది. ఆయుధాలు (Weapons) వదిలి జనజీవన స్రవంతిలోకి వెళ్లేందుకు సిద్దం.. కానీ ప్రభుత్వం సాయుధ కాల్పులు విరమణ (Cessation of Operations) ప్రకటించాలి. భద్రతా దళాల శిబిరాల ఏర్పాటు నిలిపివేయాలి. గడిచిన మూడేళ్లలో 683 మంది చనిపోయారు. అందులో 190 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టులు 669 ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 261 పోలీసులు మృతిచెందగా.. 516 మంది గాయపడ్డారు. 25కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. 2019 పార్టీ వారోత్సవం(Party Week)లో కీలక నిర్ణయం తీసుకుంది. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీ క్యాడర్ ని బలపతం చేయాలని అనేక మార్పులు చేయాలని భావిస్తున్నట్లు డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.
2021 నుంచి పార్టీ కీలక నేతలను కోల్పోయింది. వీరిలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు (Members of the Central Committee) లక్ము ,అంబీర్, సాకేత్ ,ఆనంద్ అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఇది ఒక రకంగా పార్టీకి పెద్ద దెబ్బ. తర్వాత చాలా పోలీసుల ఎన్కౌంటర్ (Police Encounter) లో చనిపోగా.. మరికొంత మంది అరెస్టు అయ్యారు. ఈస్ట్ వైపు సెంట్రల్ రీజన్స్లో కమిటీల మధ్య సమన్వయం లేక పోవడంతో అనేకమందిని కోల్పోయి పార్టీ బలహీన పడింది. 2020 లో జరిగిన పొలిట్ బ్యూరోలో పలు విషయాలు చర్చించాము. ముఖ్యంగా మాస్ బేస్ ని ఆకర్షించేలా వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని మొత్తం 7 ఏరియాలలో విభజించాము. పార్టీలో కొంత కాలంగా సీక్రెట్స్ రివీల్ అవుతున్నాయి. వాటిని పరిగణలోకి తీసుకొని 2012 నుంచి 2013 వరకు ఎన్నో లోటుపాట్లను రెక్టిఫై చేసుకున్నాం.
దేశవ్యాప్తంగా ప్రజలకు ఏ సమస్య ఉన్నా, మన సమస్యగా పోరాడాలి. పార్టీలో రిక్రూట్మెంట్ నిరంతరంగా కొనసాగాలి.. ప్రతి చర్యపై సోషల్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఎప్పుడైనా మాస్ ఆర్గనైజేషన్లో పట్టు ఉన్నప్పుడే పార్టీ కోలుకోగలుగుతుంది. ఇప్పటికే చాలా నష్టపోయాం.. వీటి నుంచి ఎన్నో పాఠాలను చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ కమిటీలలో మూడు జనరేషన్లో ఉండేలా చూసుకోవాలి. ఒక సీనియర్ సభ్యుడుతో పాటు, మిడిల్ ఏజ్ వ్యక్తితో పాటు యువకుడిని కమిటీలో పెట్టుకోవాలి. మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో సర్వేలు నిర్వహించి ఎప్పటికప్పుడు ప్లేస్ లు మారుస్తూ ఉండాలి. మొత్తానికి 2024 లో మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్లు భద్రతా దళాల ఒత్తిడిని అంగీకరిస్తూ.. ఓ వైపు శాంతి చర్చలకు సంకేతాలు ఇస్తూ.. మరోవైపు అంతర్గత పార్టీని బలోపతం చేసుకోవాలి, లొంగుబాట్లను వ్యతిరేకించాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి..
నితిన్ నబీన్ను పార్టీ చీఫ్గా ప్రకటించక పోవడం వెనుక బీజేపీ వ్యూహం ఇదే
నియంత భయపడుతున్నారు... మమతపై బీజేపీ వివాదాస్పద పోస్టు