Share News

Conviction Rate: మరీ ఇంతదారుణమా.. 5 వేల కేసులు.. 15 మంది దోషులు

ABN , Publish Date - Jul 30 , 2025 | 09:36 PM

Conviction Rate: మొత్తం ఎనిమిది కేసుల్లో 15 మంది దోషులుగా తేలారు. 1398 కేసుల్లో ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్‌ను ఫైల్ చేసింది. 5 వేల కేసుల్లో ఇది కేవలం 23 శాతం మాత్రమే.

Conviction Rate: మరీ ఇంతదారుణమా.. 5 వేల కేసులు.. 15 మంది దోషులు
Conviction Rate

న్యూఢిల్లీ: ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద జరుగుతున్న దర్యాప్తుల సమర్థతపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జనవరి 1 నుంచి జూన్ 30 వరకు యాంటీ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద 5,892 కేసులు నమోదు చేసింది. అయితే, ఈ మొత్తం కేసుల్లో 0.1 శాతం కేసుల్లో మాత్రమే దర్యాప్తు పూర్తయి, నిందితులకు శిక్షలు పడ్డాయి.


మొత్తం ఎనిమిది కేసుల్లో 15 మంది దోషులుగా తేలారు. 1398 కేసుల్లో ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్స్‌ను ఫైల్ చేసింది. 5 వేల కేసుల్లో ఇది కేవలం 23 శాతం మాత్రమే. ఇక, 353 కేసుల్లో సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్లు ఫైల్ అయ్యాయి. స్పెషల్ కోర్టులు 300 కంప్లైంట్లలో ఛార్జెస్ ఫ్రేమ్ చేశాయి. వీటిలో 66 సప్లిమెంటరీ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. మొత్తం 49 కేసుల్లో ఈడీ క్లోజర్ రిపోర్ట్స్ ఫైల్ చేసింది.


క్లోజర్ రిపోర్ట్ అంటే అర్థం.. కేసు దర్యాప్తును ముందుకు నడిపించడానికి ఏ ఆధారం, కారణం లేదని తేల్చి చెప్పటం. త్రిణముల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆ లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

లవర్స్‌తో గోవా వెళ్లడానికి యువకుల దొంగతనం.. కట్ చేస్తే..

పహల్గామ్ ఉగ్రవాదుల హతం.. ఆ రాత్రి అమిత్‌ షా ఏం చేశారంటే..

Updated Date - Jul 30 , 2025 | 09:38 PM