Constable Stabbed: మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..
ABN , Publish Date - Jul 27 , 2025 | 08:25 PM
Constable Stabbed: మహ్మద్ సఫివుల్లా తన కూతురికి రెండో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం పాషాకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. మామ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు.

మంచి చేయడానికి పోతే చెడు ఎదురు కావటం అంటే ఇదే. మామ, అల్లుడి మధ్య గొడవ ఆపడానికి వెళ్లిన ఓ కానిస్టేబుల్‌కు ఊహించని షాక్ తగిలింది. కానిస్టేబుల్ కత్తి దాడికి గురయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చామరాజపేట్, వాల్మీకి నగర్‌కు చెందిన మహ్మద్ సఫివుల్లా కూతురికి అదే ప్రాంతానికి చెందిన తర్బజ్ పాషాకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. అయితే, గొడవల కారణంగా ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు.
కొన్ని నెలల క్రితం విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ నేపథ్యంలోనే మహ్మద్ సఫివుల్లా తన కూతురికి రెండో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం పాషాకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. మామ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. మామ, అల్లుడి గొడవ చినికి చినికి గాలి వానలా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోసాగారు. దాడి సందర్భంగా పాషా ఓ బాటిల్‌తో మామ తల పగుల గొట్టాడు. అదే ప్రాంతంలో పాట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు గొడవ సమాచారం వెళ్లింది.
కానిస్టేబుల్ సంతోష్ సంఘటనా స్థలానికి వెళ్లాడు. గొడవ ఆపే ప్రయత్నం చేశాడు. సైకోలా మారిన పాషా సంతోష్‌పై దాడికి దిగాడు. తన దగ్గర ఉన్న కత్తితో కానిస్టేబుల్‌ను పొడిచేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. సంతోష్ నేలపై కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక, సఫివుల్లా చామరాజ్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో తర్బాజ్‌పై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తర్బాజ్‌తో పాటు మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ ఒక్క జ్యూస్‌తో గుండె జబ్బులన్నీ మాయం..
చంద్రబాబు పోరాడుతున్నారు.. మరి రేవంత్ ఏం చేస్తున్నారు.. కవిత ప్రశ్నల వర్షం