Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు.. ఐదుగురు మావోలు మృతి
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:51 AM
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 24: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh Maoist encounter) మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. ధర్మతాళ్లగూడెం అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు (Five Maoists) హతమయ్యారు. ఈ ఐదుగురు మావోల మృతదేహాలను పూజారీ కాంకేర్ ఎస్టీ ఎప్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
కాగా.. గత మూడు రోజులుగా తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటు తెలంగాణ వైపు నుంచి అటు ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి బలగాలు విడిపోయి మరీ కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దాదాపు 145 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కర్రెగుట్టలు మావోయిస్టులకు పెట్టని కోటగా ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ క్యాడర్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన క్యాడర్ కూడా ఇందులో తలదాచుకున్నట్లు, మావోయిస్టులు ఇక్కడే తిష్టవేసినట్లు భద్రతా బలగాలకు ఉన్న సమాచారం మేరకు ఆపరేషన్ కగార్‌ను ఇటు వైపు మళ్లించారు. కర్రెగుట్టల చుట్టూ దాదాపు పది నుంచి 12వేల మంది బలగాలను మోహరించి మూడు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు మావోయిస్టులు ఎదురుపడితే వారిని భద్రతా బలగాలు కాల్చిచంపినట్లు సమాచారం. అయితే పూర్తిస్థాయి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
PSR Prisoner Number: జైలులో పీఎస్‌ఆర్ ప్రత్యేక అభ్యర్థన.. ఏంటంటే
మూడు రోజులుగా కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలకు ఆహారం సరఫరా చేసేందుకు మూడు హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నారు. ఆహారంతో పాటు ఆయుధ సామాగ్రిని ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. 145 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో పూర్తి స్థాయిలో ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాతే వెనుతిరగాలని భద్రతా బలగాలు, కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక నెల రోజుల నుంచి వ్యూహ ప్రతివ్యూహాలు నడుస్తున్నాయి. నెల రోజుల క్రితం మావోయిస్టుల పేరుతో ఓ లేఖ విడుదలైంది. కర్రెగుట్టల చుట్టూ బాంబులు పెట్టామని శాంతా పేరుతో లేఖ విడుదలైంది. అయితే అదంతా కూడా పోలీసుల దుష్రచారం అని మావోయిస్టులు కొట్టిపారేశారు. ఆ తర్వాత వారు ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖను తాము ప్రకటించలేదని, ఇదంతా కూడా పోలీసులు కావాలనే చేస్తున్నారని ప్రకటించారు. అప్పటి నుంచి వ్యూహ ప్రతివ్యూహాలతో ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఆర్మీ జవాన్ మృతి
Hyderabad: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని..
Read Latest National News And Telugu News