Share News

Chhattisgarh: లొంగిపోయిన 33 మంది నక్సల్స్

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:51 PM

మావోయిస్టు సిద్ధాంతాల భావజాలం, స్థానిక గిరిజనలపై జరిగిన దురాగతాలపై విసిగిపోయి లొంగిపోతున్నట్టు వీరంతా ప్రకటించారని సుక్మా సూపరింటెండెంట్ ఆఫో పోలీస్ కిరణ్ చవాన్ తెలిపారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 'నియాద్ నెల్లనార్' (యువర్ గుడ్ విలేజ్) పథకానికి వీరంతా ఆకర్షితులైనట్టు చెప్పారు.

Chhattisgarh: లొంగిపోయిన 33 మంది నక్సల్స్

సుక్మా: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలైట్లను తుదముట్టిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం మరోమారు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం సుక్మా (Sukma) జిల్లాలో 33 మంది నక్సలైట్లు శుక్రవారంనాడు లొంగిపోయారు. వీరిలో 17 మంది (Naxals) నక్సల్స్‌పై రూ.49 లక్షల రివార్డు ఉంది. తాజాగా లొంగిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలతో సహా 22 మంది సీనియర్ పోలీసులు అధికారులు, సీఆర్‌పీఎఫ్ ముందు లొంగిపోయారు. ఆ తర్వాత మరో 11 మంది పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నారు.

Murshidabad Violence: రాష్ట్రం తగులబడుతుంటే ఆ ఎంపీ ఏమైనట్టు?


మావోయిస్టు సిద్ధాంతాల భావజాలం, స్థానిక గిరిజనలపై జరిగిన దురాగతాలపై విసిగిపోయి లొంగిపోతున్నట్టు వీరంతా ప్రకటించారని సుక్మా సూపరింటెండెంట్ ఆఫో పోలీస్ కిరణ్ చవాన్ తెలిపారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 'నియాద్ నెల్లనార్' (యువర్ గుడ్ విలేజ్) పథకానికి వీరంతా ఆకర్షితులైనట్టు చెప్పారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు మిలటరీ డిప్యూటీ కమాండర్ ముచాకి జోగా, స్క్వాడ్ సభ్యురాలైన ఆయన భార్య ముచాకి జోగి ఉన్నారని తెలిపారు. వరిలో రూ.8 లక్షల అవార్డు ఉందన్నారు. మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు దేవే, దుధి బుధ్రాలపై ఒక్కక్కరిపై రూ.5 లక్షల రివార్డు, మరో ఏడుగురిపై రూ.2 లక్షలు రివార్డు ఉందని తెలిపారు. లొంగిపోయిన మరికొందరికి భద్రతా బలగాలపై దాడుల్లో ప్రమేయం ఉందని చెప్పారు. కాగా, నక్సల్స్ లొంగుబాటులో జిల్లా పోలీసులు, జిల్లా రిజర్వ్డ్ గార్డులు, సీఆర్‌పీఎఫ్, దాని అనుబంధ విభాగం కోబ్రా కీలక పాత్ర వహించారు.


ఇవి కూడా చదవండి..

India: బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్..

PM Modi-Elon Musk: ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

Updated Date - Apr 19 , 2025 | 12:36 PM