Share News

RN Ravi: ప్రధాని దీర్ఘకాల దృష్టి ‘కాశి తమిళ సంగమం’..

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:03 PM

దేశంలోని అన్ని ప్రాంతాలకు కాశితో సంబంధాలున్నాయని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. స్థానిక ఐఐటీ మద్రాసు క్యాంప్‌సలో ‘కాశి తమిళ సంఘం 4.0’ను సోమవారం గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ... కాశి తమిళ సంగమం ప్రధాన మంత్రి మోదీ దీర్ఘకాల దృష్టి అన్నారు.

RN Ravi: ప్రధాని దీర్ఘకాల దృష్టి ‘కాశి తమిళ సంగమం’..

- గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

చెన్నై: దేశంలోని అన్ని ప్రాంతాలకు కాశితో సంబంధాలున్నాయని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పేర్కొన్నారు. స్థానిక ఐఐటీ మద్రాసు క్యాంప్‌సలో ‘కాశి తమిళ సంఘం 4.0’ను సోమవారం గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(RN Ravi) ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ... కాశి తమిళ సంగమం ప్రధాన మంత్రి మోదీ దీర్ఘకాల దృష్టి అన్నారు. ఆధ్యాత్మిక రాజధాని కాశితో, దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధాలున్నాయని తెలిపారు. కాశి తమిళ సంగమం లాంటి కార్యక్రమం నిర్వహించడం కష్టతరమైనదన్నారు.


nani6.3.jpg

ప్రజలను ఎంపిక చేసి వారిని తీసుకెళ్లడం సామాన్య విషయం కాదన్నారు. ఈ పనులను ఐఐటీ డైరెక్టర్‌ కామకోటి చక్కగా నిర్వహించారని కొనియాడారు. సంస్కృతి అనేది ప్రభుత్వం నడిపేది కాదని, అది ప్రజల నుంచి పుడుతుందన్నారు. అలాంటి దానిని రాజకీయం చేయవద్దని సూచించారు. ఈ ఏడాది కాశి తమిళ సంగమం వేడుకలు ‘తమిళం నేర్చుకోండి’ అనే శీర్షికన నిర్వహించనున్నామన్నారు.ఉత్తరప్రదేశ్‌ నుంచి 300 మంది విద్యార్థులు తమిళం నేర్చుకునేందుకు రాష్ట్రానికి వచ్చారని తెలిపారు.


nani6.2.jpg

ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తమిళం నేర్చుకునేలా కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. అసోం నుంచి వచ్చిన విద్యార్థులకు రాజ్‌ భవన్‌లో తమిళం నేర్పించామన్నారు. ‘ఒకే భారతం-అత్యున్నత భారతం’ అనేది రాజకీయ నినాదం కాదని గుర్తించుకోవాలన్నారు. ఒకే కుటుంబ సభ్యులు కలిగిన పవిత్ర దేశమని, సాంస్కృతిక వారసత్వాన్ని, మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందేందుకు ప్రయత్నించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఐటీ మద్రాసు డైరెక్టర్‌ కామరోటి, కేంద్ర సెమ్మొళి తమిళ పరిశోధన సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ సుధా శేషయన్‌, ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖరన్‌, పారిశ్రామికవేత్త నల్లి కుప్పుస్వామి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్‌-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్‌

తిరుమల లడ్డూ మిఠాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 12 , 2025 | 01:03 PM