Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర .. అధికారుల హై అలర్ట్..
ABN , Publish Date - Apr 29 , 2025 | 06:51 PM
హిందువులకు ఎంతో పవిత్రమైన యాత్ర చార్ ధామ్ యాత్ర. హిమాలయ పర్వతాలలోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి నాలుగు పవిత్ర క్షేత్రాలను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటారు. చార్ ధామ్ యాత్ర రేపు ప్రారంభం కావడంతో ఆ యాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరాఖండ్: చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30, 2025న ప్రారంభం కానుంది. గత సంవత్సరం 48 లక్షలకు పైగా యాత్రికులు చార్ ధామ్‌ను సందర్శించగా, ఈసారి 50 లక్షలకు పైగా భక్తులు అక్కడికి చేరుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 20 లక్షల మంది యాత్రికులు కూడా చార్ ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపధ్యంలో అధికారులు హై అలర్ట్ అయ్యారు.
కట్టుదిట్టమైన భద్రత
దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలు, మతపరమైన ప్రదేశాలలో ప్రత్యేక భద్రతను తీసుకుంటున్నారు. చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30 అంటే రేపటి నుండి ఉత్తరాఖండ్‌లో ప్రారంభమవుతుంది. చార్ ధామ్ యాత్ర సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు, పోలీసు యంత్రాంగం వారి భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది.
ఏప్రిల్ 30 నుండి ప్రారంభమయ్యే చార్ధన్ యాత్రలో, గంగోత్రి, యమునోత్రి ధామ్ తలుపులు మొదట తెరస్తారు. దీని తరువాత, మే 2న కేదార్‌నాథ్ తలుపులు తెరుచుకుంటాయి. మే 4న బద్రీనాథ్ తలుపులు తెరుచుకుంటాయి. ఈసారి చార్‌ధామ్ యాత్రలో భక్తుల సంఖ్య గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అయితే, కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. భక్తులకు తమ భద్రత విషయంలో ఎలాంటి భయం కలగకుండా పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. చార్‌ధామ్‌లోని అన్ని దేవాలయాల వద్ద, ప్రయాణ మార్గంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. దీనితో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి 10 కంపెనీల పారామిలిటరీ దళాలను కూడా కోరింది. వీటిలో 6 కంపెనీలు చార్‌ధామ్ యాత్ర మార్గాల్లో మోహరించారు. అయితే 4 కంపెనీలు కుమావున్ ప్రాంతంలోని ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల భద్రతను నిర్వహిస్తాయి.
చార్‌ధామ్ కోసం ..
24 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
66 ఇన్స్పెక్టర్
366 సబ్ ఇన్స్పెక్టర్
615 హెడ్ కానిస్టేబుల్
1222 కానిస్టేబుల్
208 మంది మహిళా కానిస్టేబుళ్లు
926 హోమ్ గార్డ్
1049 పిఆర్‌డి సైనికులు
9 కంపెనీ PAC
SDRF 26 ఉప బృందాలు మోహరించనున్నాయి.
Also Read:
Pahalgam Terror Attack: హోం శాఖ కార్యాలయంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి