Char Dham Yatra 2025: మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:46 PM
ఛార్ థామ్ యాత్ర రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కలిగించే కీలకమైన యాత్ర అని, యాత్రికుల భద్రత, సౌకర్యాల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామ్ తెలిపారు.

డెహ్రాడూన్: ఛార్ థామ్ యాత్ర-2025 ప్రారంభమవుతోంది. ఒకదాని వెనుక మరొక థామ్ తలుపులు తెరుచుకోనున్నాయి. ఛార్ థామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి ద్వారాలు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. కేదార్‌నాథ్ తలుపులు మే 2, బద్రీనాథ్ తలుపులు మే 4న తెరుచుకుంటాయని శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTS) ప్రకటించింది.
India-Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్య.. తీవ్రంగా ఖండించిన భారత్
యాత్రికల భద్రతకు సీఎం భరోసా
ఛార్ థామ్ యాత్ర రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కలిగించే కీలకమైన యాత్ర అని, యాత్రికుల భద్రత, సౌకర్యాల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామ్ తెలిపారు. యాత్రలో ఎలాంటి ఆటంకాలు కలుగుకుండా చూసేందుకు, సురక్షితంగా యాత్రికులు తమ యాత్ర పూర్తి చేసుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఛార్‌థామ్ యాత్ర సంప్రదాయబద్ధంగా యమునోత్రితో మొదలై బద్రీనాథ్‌తో ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి..