SIR Truce: ఎన్నికల సంస్కరణలపై వచ్చే వారంలో చర్చ.. కేంద్రం, విపక్షాల మధ్య కుదిరిన అంగీకారం
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:51 PM
కేవలం ఎస్ఐఆర్ పైనే కాకుండా ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఎస్ఐఆర్‌పై వెంటనే చర్చ జరగాలని ఉభయసభల్లోనూ విపక్షాలు పట్టుబడుతున్నాయి.
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండోరోజైన మంగళవారం కూడా పార్లమెంటులో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR)పై విస్తృత చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో తలెత్తిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. కేవలం ఎస్ఐఆర్ పైనే కాకుండా ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఎస్ఐఆర్‌పై వెంటనే చర్చ జరగాలని ఉభయసభల్లోనూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. చర్చకు తాము సిద్ధమేనని, అయితే గడువు పెట్టవద్దని విపక్షాలను కేంద్రం కోరింది. బీఏసీలో నిర్ణయించిన ప్రకారం 'వందేమాతరం'పై తొలుత చర్చ జరగాలని, ఆ తర్వాత అన్ని ముఖ్యమైన అంశాలపైనా చర్చించవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈనెల 7వ తేదీతో వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందున దీనిపై తొలుత చర్చించేందుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించింది.

ఫోర్ల్ లీడర్లతో సమావేశం
కాగా, ఫ్లోర్ లీడర్లతో లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం జరిపారు. వచ్చే వారంలో ఎన్నికల సంస్కరణలపై చర్చ చేపట్టందుకు కేంద్రం ఈ సమావేశంలో అంగీకరించింది. ఆ ప్రకారం ఈనెల 8వ తేదీ సోమవారంనాడు తొలుత 'వందేమాతరం'పై చర్చ జరుగుతుందని, 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ ఉంటుందని తెలిసింది.
ఇవి కూడా చదవండి..
పార్లమెంట్లో 'సంచార్ సాథీ' రగడ.. దేశ ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన
సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి