Share News

Supreme Court: జాతీయ భద్రతకు స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటి? పెగాసస్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:36 PM

పెగాసస్ స్పైవేర్‌ను తమపై ఉపయోగించినట్టు ఎవరైనా అనుమానిస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని, నిజంగానే వారిని టార్గెట్ చేశారా లేదా అనే దానిపై సమాచారం అందిస్తామని ధర్మాసనం తెలిపింది. సాంకేతిక బృందం నివేదక అనేది వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్ కాదని స్పష్టం చేసింది.

Supreme Court: జాతీయ భద్రతకు స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటి? పెగాసస్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పెగాసస్ (Pegasus) స్పైవేర్ వ్యవహారం 2021లో సంచలనమైంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పైవేర్‌తో పాత్రికేయుు, పౌరసమాజం ప్రముఖులపై నిఘా పెట్టారంటూ అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రత కోసం స్పైవేర్ ఉపయోగించడంలో తప్పులేదని స్పష్టం చేసింది. గుఢచర్యం ఆరోపణలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇన్వెస్టిగేషన్ నివేదికను బహిర్గతం చేయలేమని, ఇది దేశ భద్రత, సార్వభౌమాధికారిని సంబంధించిన అంశమని పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసునని, మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ


పెగాసస్ స్పైవేర్‌ను తమపై ఉపయోగించినట్టు ఎవరైనా అనుమానిస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని, నిజంగానే వారిని టార్గెట్ చేశారా లేదా అనే దానిపై సమాచారం అందిస్తామని ధర్మాసనం తెలిపింది. సాంకేతిక బృందం నివేదక అనేది వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్ కాదని స్పష్టం చేసింది.


స్పైవేర్ వినియోగంపై..

''ఒక దేశం స్పైవేర్ వినియోగిస్తే అందులో తప్పేముంది? ఎవరి మీద స్పైవేర్ ఉపయోగించారనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. దేశ భద్రత విషయంలో మాత్రం రాజీపడకూడదు. పౌర సమాజంపై కాకుండా దేశ వ్యతిరేక శక్తులపై వినియోగిస్తే తప్పులేదు. సామాన్య పౌరులపై ఉపయోగిస్తే దానిపై మేము దర్యాప్తు జరిపిస్తాం. సామాన్య ప్రజల గోప్యతకు రక్షణ కల్పిస్తాం'' అని జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ అన్నారు. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు.


పెగాసస్ వివాదం

ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి 50,000 మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేశారంటూ 2021లో 17 వార్తా సంస్థల కన్సార్టియం ఓ కథనం ప్రచురించింది. ఇండియాలో టార్గెట్‌ చేసిన వారిలో రాహుల్ గాంధీ, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, అనేక మంది పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులు ఉన్నట్టు తెలిపింది. ఈ కథనం ఇండియాలో రాజకీయ దుమారం రేపింది. విపక్షాలు కేంద్రంపై విమర్శల దాడికి దిగాయి. అయితే ఇది సత్యదూరమని కేంద్రం వివరణ ఇచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ దర్యాప్తు జరిపింది. 29 ఫోన్లలో పెగాసిస్‌కు ఆధారాలు లేవని కమిటీ తెలిపింది. అయితే ఐదు ఫోన్లలో మాల్‌వేర్‌ ఉన్నట్టు కనుగొంది.


ఇవి కూడా చదవండి..

Pakistan: భారత 'గూఢచారి డ్రోన్‌'ను కూల్చేశామన్న పాక్

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Viral News: పాకిస్తాన్‎ను 4 ముక్కలు చేయాలి..ఇలా చేస్తేనే వారికి మేలు..

Updated Date - Apr 29 , 2025 | 03:38 PM