CBSE: సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు
ABN , Publish Date - Jun 25 , 2025 | 05:17 PM
సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్ కంట్రోల్ సంయమ్ భారద్వాజ్ మాట్లాడుతూ, పరీక్షల ఫస్ట్ ఫేజ్ ఫిబ్రవరిలోనూ, రెండో ఫేజ్ మేలోను ఉంటాయని, ఏప్రిల్, జూన్‌లో ఫలితాలు వెలువడతాయని చెప్పారు. ఫస్ట్ ఫేజ్‌కు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరిలో ఉంటాయి. ఈ పరీక్షలకు విద్యార్థులంతా తప్పనిసరిగా హాజకావాల్సి ఉంటుంది. ఇక రెండో విడత పరీక్షలు మేలో ఉంటాయి. ఇది ఐచ్ఛికం. తమ పెర్‌ఫారమెన్స్ పెంచుకోవాలని ఆశించే విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మాత్రం అకడమిక్ సెషన్‌లో ఒకేసారి ఉంటుంది.
సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్ కంట్రోల్ సంయమ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. పరీక్షల ఫస్ట్ ఫేజ్ ఫిబ్రవరిలోనూ, రెండో ఫేజ్ మేలోను ఉంటాయన్నారు. ఏప్రిల్, జూన్‌లో ఫలితాలు వెలువడతాయని తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌కు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని, రెండో ఫేజ్ వారివారి ఇష్టమని చెప్పుకొచ్చారు. విద్యార్థులు సైన్స్, మేథమెటిక్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజ్‌లలో మూడు సబ్జెక్టులను ఎంచుకుని బెటర్‌మెంట్ కోసం రాసుకోవచ్చని వెల్లడించారు.
వింటర్ బౌండ్ స్కూళ్లలో..
చలి ఎక్కువగా ఉండే (వింటర్ బౌండ్) స్కూళ్లలోని పదో తరగతి విద్యార్థులకు ఏదో ఒక ఫేజ్‌లో పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నారు. సీబీఎస్ఈ గత ఫిబ్రవరిలో ఈ పరీక్షలకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది.
ఇవి కూడా చదవండి..
రైలు ప్రయాణీకులకు షాక్.. జూలై 1 నుంచి పెరగనున్న టికెట్ ఛార్జీలు..! ఎంతంటే..?
భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
For National News And Telugu News