Classroom Scam: రూ.2,000 కోట్ల కుంభకోణం.. ఆప్ నేతలపై ఏసీబీ కేసు
ABN , Publish Date - Apr 30 , 2025 | 02:44 PM
ఏసీబీ అధికారాల సమాచారం ప్రకారం, ఆప్ ప్రభుత్వ హయాంలో 12,748 తరగతి గదులు, అసోసియేటెడ్ బిల్డింగ్‌ల నిర్మాణాలకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. సిసోడియా, జైన్‌లను విచారించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత మార్చిలో ఆమోదం తెలిపారు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో అవనీతికి పాల్పడ్డారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రులు మనీష్ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్ (Satyender Jain)లపై అవినీతి నిరోధక విభాగం (ACB) కేసు నమోదు చేసింది.
Central Government: జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
ఏసీబీ అధికారాల సమాచారం ప్రకారం, ఆప్ ప్రభుత్వ హయాంలో 12,748 తరగతి గదులు, అసోసియేటెడ్ బిల్డింగ్‌ల నిర్మాణాలకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. సిసోడియా, జైన్‌లను విచారించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత మార్చిలో ఆమోదం తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-A కింద అనుమతులు మంజూరు కావడంతో దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 12,748 తరగతి గదులు/భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూ.2,892 కోట్లు. ఒక్కో క్లాస్ రూము నిర్మాణానికి రూ.24,86 లక్షల చొప్పున టెండర్లు ఇచ్చారు. గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోగా, భారీగా ఖర్చు చేశారు. గడువు ప్రక్రియను పాటించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లను నియమించడం వల్ల సుమారు 5 రెట్లు వ్యయం పెరిగింది. 30 సంవత్సరాలు ఉండేలా తరగతి గదులను కట్టారు. అయితే వాటికి అయిన ఖర్చు మాత్రం 75 ఏళ్లు ఉండేలా అయింది. కాంట్రాక్టులు ఆప్ ఆద్మీ పార్టీతో దగ్గర సంబంధాలు ఉన్నవాళ్లకే దక్కాయి. తరగతి గదుల నిర్మాణం ప్రాజెక్టులో తీవ్రమైన అవకతవకలు జరిగినట్టు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గతంలో నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదకపై మూడేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
బీజేపీ ఫిర్యాదు
తరగతి గదులు, భవనాల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు బీజేపీ ఢిల్లీ విభాగం ప్రతినిధి హరీష్ ఖురానా, బీజేపీ ఎమ్మెల్యే, ఆప్ మాజీ మంత్రి నీల్‌కాంత్ బక్షి తొలుత ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ లాంఛనప్రాయంగా విచారణ ప్రాంభించింది. కాగా, ఇప్పటికే లీగల్ చిక్కులు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌కు ఈ కొత్త కేసు మరిన్ని చిక్కులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే సిసోడియా కస్టడీలో ఉన్నారు. సత్యేంద్ర జైన్ మరో మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..