Share News

Budget Session Resumes: రేపు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ పునఃప్రారంభం.. కీలక బిల్లులపై చర్చ..

ABN , Publish Date - Mar 09 , 2025 | 06:24 PM

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కొంత విరామానంతరం సోమవారం తిరిగి ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 20 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి.

Budget Session Resumes: రేపు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ పునఃప్రారంభం.. కీలక బిల్లులపై చర్చ..
Budget Session Resumes Monday

పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కొంత విరామానంతరం సోమవారం తిరిగి ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 20 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా మణిపూర్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్ కోసం బడ్జెట్‌ను సోమవారం పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా తరువాత మణిపూర్‌లో ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన అమలులో ఉంది (Budget Session Resumes).


అలాగే ఓటర్ ఐడీ కార్డులపై డూప్లికేట్ ఎపిక్ సంఖ్యల సమస్య గురించి ప్రతిపక్షాలు ఆందోళన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ డూప్లికేట్ ఎపిక్ సంఖ్యలతో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మణిపూర్‌లో తాజా హింసాకాండ, ట్రంప్ ప్రభుత్వంతో భారత్ వ్యవహరణ తీరు వంటి సమస్యలను కూడా ప్రతిపక్షాలు కూడా లేవనెత్తే అవకాశం ఉంది. కాగా, బడ్జెట్ పద్దులకు పార్లమెంట్ ఆమోదముద్ర పాందడం, బడ్జెట్ సంబంధిత అంశాలను పూర్తి చేయడం, మణిపూర్ బడ్జెట్‌కు, వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం పొందడంపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించబోతోంది.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2025 | 06:24 PM