Share News

Body Worn Cameras: జవాన్లకు శరీరంపై ధరించే కెమెరాలు

ABN , Publish Date - Jul 28 , 2025 | 05:11 AM

భారత్‌-బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ సరిహద్దు పొడవునా భద్రతా విధులు నిర్వర్తిస్తున్న బీఎ్‌సఎఫ్‌ జవాన్లకు 5,000 పై చిలుకు శరీరంపై ధరించే కెమెరాలు అందజేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.

Body Worn Cameras: జవాన్లకు శరీరంపై ధరించే కెమెరాలు

  • బంగ్లా సరిహద్దుల్లో భద్రత పటిష్ఠం

  • కేంద్ర హోంశాఖ నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 27: భారత్‌-బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ సరిహద్దు పొడవునా భద్రతా విధులు నిర్వర్తిస్తున్న బీఎ్‌సఎఫ్‌ జవాన్లకు 5,000 పై చిలుకు శరీరంపై ధరించే కెమెరాలు అందజేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. భారత్‌లో అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయులను వారి స్వదేశానికి పంపించేందుకు అవసరమైన ఆధారాలు, విజువల్‌ రికార్డుల సేకరణ కోసం జవాన్లకు వీటిని అందించాలని నిర్ణయానికి వచ్చింది. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న బీఎ్‌సఎఫ్‌ జవాన్లపై నేరగాళ్ల దాడుల నేపథ్యంలో కేంద్రం నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.


దీనికి తోడు గత ఏడాది ఆగస్టు ఐదో తేదీన బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా సర్కారు పతనమైన తర్వాత సరిహద్దుల్లో భద్రత బలోపేతంతోపాటు జవాన్లకు శరీరంపై ధరించే కెమెరాలు అందించాలని బీఎ్‌సఎఫ్‌ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. సరిహద్దుల్లో 4,096 కి.మీ పొడవునా ఎంపిక చేసిన బీఎ్‌సఎఫ్‌ ఔట్‌ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ కెమెరాలు అందిస్తారు.

Updated Date - Jul 28 , 2025 | 05:11 AM