Terror Incident: మరో పెద్ద ఉగ్రదాడి గుట్టురట్టు
ABN , Publish Date - May 01 , 2025 | 03:50 PM
దేశంలో మరో ఉగ్రదాడి గుట్టు రట్టైంది. BSF(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)‐ పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ఈ ముప్పు తప్పింది. గత వారం రోజుల్లో భారత అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో..

BSF‐Punjab Police Bust Arms Haul: దేశంలో మరో ఉగ్రదాడి గుట్టు రట్టైంది. BSF(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)‐ పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ఈ ముప్పు తప్పింది. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని భరోపాల్ గ్రామంలో ఈ ఉగ్రమూక బాగోతం బట్టబయలైంది. దుండగులు ఆయుధాల అక్రమ రవాణాకు ఉపక్రమిస్తోన్న తరుణంలో బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు చాకచక్యంగా ఉగ్రమూక ఉనికిని పసిగట్టి పెద్ద ముప్పును తప్పించారు.
సరిహద్దు భద్రతా దళం(BSF), పంజాబ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భాగంగా అమృత్‌సర్ జిల్లాలోని సదరు గ్రామం నుండి రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లతో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఇవాళ BSF అధికారి ఒకరు తెలిపారు. భరోపాల్ గ్రామం సమీపంలో ఈ ఆపరేషన్ జరిగింది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, ఆరు మ్యాగజైన్‌లతో మూడు పిస్టళ్లు ఇంకా 50 లైవ్ రౌండ్లు ఉన్నాయి.
"పంజాబ్ పోలీసులతో వేగంగా సమన్వయం చేసుకోవడం వల్లే ఒక పెద్ద ఉగ్రవాద ఘటన జరగకుండా నిరోధించాం" అని BSF అధికారి తెలిపారు. గత వారం రోజుల్లో భారత అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భారీగా పట్టుబడ్డ ఆయుధాలు, పేలుడు పదార్థాల రికవరీలలో ఇది ఒకటి. కొన్ని రోజుల క్రితం, అమృత్‌సర్‌లోని సహోవాల్ గ్రామంలో ఇలాంటి ఉమ్మడి ఆపరేషన్‌లో ఐదు హ్యాండ్ గ్రెనేడ్‌లు, 4.50 కిలోల ఆర్‌డిఎక్స్, నాలుగు పిస్టళ్లు, 220 రౌండ్లు, రెండు రిమోట్ కంట్రోల్‌లు, బ్యాటరీ ఛార్జర్ స్వాధీనం చేసుకున్నారు.
Pahalgam Terror Attack: పహల్గామే కాదు.. ఆ అటాక్ చేసింది కూడా వీరే..