Share News

Forced Marriage: ముట్టుకుంటే 35 ముక్కలుగా నరికేస్తా

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:04 AM

పెళ్లయిన మర్నాడు తొలిరాత్రి పడగదిలోకి వెళ్లిన ఆ వరుడు, నిండా మేలి ముసుగు కప్పుకొని పడక మీద మౌనంగా కూర్చు న్న వధువును చూసి ముచ్చటపడ్డాడు.. ఆప్యాయం గా భుజమ్మీద చేయి వేయబోతే..

Forced Marriage: ముట్టుకుంటే 35 ముక్కలుగా నరికేస్తా

  • తొలిరాత్రి పడక గదిలో భర్తను కత్తితో బెదిరించిన భార్య .. ప్రియుడితో పరార్‌

  • యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఘటన

లఖ్‌నవూ, జూన్‌ 25: పెళ్లయిన మర్నాడు తొలిరాత్రి పడగదిలోకి వెళ్లిన ఆ వరుడు, నిండా మేలి ముసుగు కప్పుకొని పడక మీద మౌనంగా కూర్చు న్న వధువును చూసి ముచ్చటపడ్డాడు.. ఆప్యాయం గా భుజమ్మీద చేయి వేయబోతే.. మేలి ముసుగులో దాచుకున్న పదునైన కత్తిని తీసి.. ‘నన్ను తాకొద్దు.. తాకేందుకు ప్రయత్నించావో 35 ముక్కలుగా నరికేస్తా. నేను అమన్‌కే సొంతం’ అని తీవ్ర స్వరంతో భర్తను హెచ్చరించింది. దీంతో ఆ వరుడు బెంబేలెత్తిపోయాడు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘ టన వెలుగుచూసింది. అమన్‌ ఆమె ప్రియుడు!! పెళ్లి నిశ్చయించినప్పుడు, పెళ్లి జరుగుతున్నప్పుడు అభ్యంతరం చెప్పకపోగా.. వేడుక ఆసాంతం నవ్వు తూ తుళ్లుతూ కనిపించిన ఆ వధువులో వివాహమయ్యాక ఇలా మరో కోణం కనిపించింది.


ఆ వరుడు 26 ఏళ్ల నిషాద్‌. వధువు సితార! పడకగదిలో ఆమె కత్తి పట్టుకొని మంచమ్మీద కూర్చుంటే.. నిషాద్‌ భయంభయంగా ఆ గదిలోని సోఫాలో రాత్రంతా కూర్చుండిపోయాడు. మూడు రాత్రులూ ఇలానే గడిచిన తర్వాత విషయాన్ని అతడు తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారు సితార తల్లిదండ్రులకు చెప్పడం, వారొచ్చి ఆమెకు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. తాను కన్నవారి బలవంతమ్మీదే పెళ్లి చేసుకున్నానని, తనకు నిషాద్‌తో పెళ్లి ఇష్టంలేదని, తనను అమన్‌ వద్దకు పంపాలని సితార పట్టుబట్టింది. ఒక రోజు అత్తారింట్లోంచి అర్ధరాత్రి గోడ దూకి ప్రియుడు అమన్‌తో కలిసి వెళ్లిపోయింది.

Updated Date - Jun 26 , 2025 | 06:04 AM