Air India Crash: దొరికిన బ్లాక్ బాక్స్.. విమాన ప్రమాదానికి కారణం అదేనా..?
ABN , Publish Date - Jun 13 , 2025 | 06:53 PM
విమానం వేగం, ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, కాక్‌పిట్ వంటి కీలక సమాచారం బ్లాక్‌బాక్స్‌లో ఉంటుంది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణలు రికార్డవుతాయి. ఎలాంటి విపత్తులు ఎదురైనా డేటా చెక్కుచెదరకుండా ఉండేలా బ్లాక్ బ్సాక్‌ను రూపొందిస్తారు.

అహ్మదాబాద్: ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం ఘోర ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించే బ్లాక్‌బాక్స్ (Black Box) శుక్రవారం నాడు లభ్యమైంది. విమానం ఢీకొట్టిన డాక్టర్స్ హాస్టల్ పైకప్పుపై ఈ బ్లాక్ బాక్స్ దొరికినట్టు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తెలిపింది. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది సాయంతో ఏఏఐబీ టీమ్ జరిపిన గాలింపు చర్యల్లో ఇది దొరికింది. పేరుకే బ్లాక్ బాక్స్ కానీ మెరిసే ఆరంజ్ కలర్‌లో ఈ బాక్స్ ఉంటుంది. శిథిలాల్లోనూ, నీటిలోనూ సులభంగా దీన్ని గుర్తించే వీలుంటుంది.
విమానం వేగం, ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, కాక్‌పిట్ అడియా వంటి కీలక సమాచారం ఈ బ్లాక్‌బాక్స్‌లో ఉంటుంది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణలు రికార్డవుతాయి. ఎలాంటి విపత్తులు ఎదురైనా డేటా చెక్కుచెదరకుండా ఉండేలా బ్లాక్ బ్సాక్‌ను రూపొందిస్తారు. తీవ్ర ఉష్ణోగ్రతను, నీటిలో పడినా తట్టుకుని ఇది నిలబడుతుంది. స్టీల్, టైటానియం వంటి మెటీరియల్‌తో రూపొందిస్తారు. ప్రమాదం వాటిల్లినప్పుడు 'మేడే' అంటూ సమీపంలోని ఏటీసీకి పైలట్ సందేశం పంపుతారు. పైలట్-కోపైలట్ సంభాషణలు డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్‌లో నమోదవుతాయి. ఈ డీఎఫ్‌డీఆర్‌నే బ్లాక్‌బ్లాక్‌గా పిలుస్తారు.
ఇంజన్ లోపమే కారణమా
ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే క్రమంగా కిందకి పడిపోతూ బీజే మెడికల్ కాలేజీ డాక్టర్ల రెసిడెన్షియ్ల క్వార్డర్స్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజన్‌లో తలెత్తిన లోపమే ఈ ఘోర దుర్ఘటనకు కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ సమాచారాన్ని విశ్లేషిస్తుండటంతో ప్రమాద కారణాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
బోయింగ్ 787-8 విమానాల నిలిపివేత.. పరిశీలనలో కేంద్రం
అనేక మంది వద్దనుకునే సీట్లో కూర్చుని సేఫ్ అయిన అదృష్టవంతుడు.. ఎలాగో తెలుసా..
For National News And Telugu News