Bihar election results: అమిత్ షా చెప్పింది నిజమే.. బీహార్‌లో ఎన్డీయే కూటమి ఆధిక్యం 180 ప్లస్..
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:39 AM
బీహార్‌లో ఏన్డీయే విజయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందుగానే ఊహించారు. ఎన్డీటీవీ బీహార్ పవర్ ప్లే సమ్మిట్‌లో అమిత్ షా.. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే సాధించబోయే సీట్ల గురించి ముందుగానే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బీహార్‌లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏన్డీయే స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమై మూడు గంటలు దాటే సమయానికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 180కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉదయం 11.30 గంటల సమయానికి ఎన్డీయే కూటమి 187 స్థానాల్లోనూ, మహాగఠ్ బంధన్ 49 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఏన్డీయే అద్భుత ప్రదర్శన ఆ కూటమి శ్రేణుల్లో సంతోషాన్ని నింపుతోంది (Amit Shah prediction).
బీహార్‌లో ఈ స్థాయి విజయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందుగానే ఊహించారు. ఎన్డీటీవీ బీహార్ పవర్ ప్లే సమ్మిట్‌లో అమిత్ షా.. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే సాధించబోయే సీట్ల గురించి ముందుగానే చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 160కి పైగా సీట్లు గెలుచుకుంటుందని, మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. గత వారం కూడా అమిత్ షా ఇదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బీహార్‌లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది (BJP NDA 160 seats).
బీహార్‌లో ఎన్డీయే కూటమిని పంచ పాడవులతో అమిత్ షా పోల్చారు (Bihar vote count). ఎన్డీయే కూటమి కింద బీజేపీ, జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు జట్టు కట్టాయి. తామంతా ఐక్యంగా ఉన్నామని అమిత్ షా గత వారం ప్రకటించారు. ఇక, ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీయే కూటమికే మద్దతు ఇచ్చాయి. దాదాపు అన్ని సర్వేలు నితీష్ కుమార్ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన విజయాన్ని అందించాయి.
ఇవీ చదవండి:
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉమర్ బంధువు అరెస్ట్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..