Share News

Chaitanya Baghel Arrest: మద్యం కుంభకోణంలో బఘేల్‌ కుమారుడి అరెస్టు

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:32 AM

మద్యం కుంభకోణంలో ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు భూపేష్‌ బఘేల్‌ కుమారుడు చైతన్య బఘేల్‌ను..

Chaitanya Baghel Arrest: మద్యం కుంభకోణంలో బఘేల్‌ కుమారుడి అరెస్టు
Chaitanya Baghel Arrest

న్యూఢిల్లీ, జూలై 18: మద్యం కుంభకోణంలో ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు భూపేష్‌ బఘేల్‌ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఆయనను ఈడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయాధికారి అయిదు రోజుల రిమాండ్‌ విధించారు. ఛత్తీస్‌గఢ్‌‌లోని దుర్గ్‌లో ఉన్న నివాసంలో ఉండగా ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 2019-2022 మధ్యకాలంలో భూపేష్‌ బఘేల్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.2,160 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందంటూ ఈడీ కేసు నమోదు చేసింది. చైతన్య బఘేల్‌ ఆధ్వర్యంలో సమాంతర వ్యవస్థ నడిచిందని, అక్రమ మార్గాల్లో సొమ్ము ఆయనకు చేరిందని ఆరోపించింది. ఈ సందర్భంగా భూపేష్‌ బఘేల్‌ మీడియాతో మాట్లాడుతూ పుట్టిన రోజునాడు కుమారుడిని అరెస్టు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదానీకి కేటాయించిన బొగ్గు బ్లాకుల ప్రాంతంలో వేలాది చెట్లను నరికివేశారని, దీనిపై శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నిస్తామని తెలిసే మోదీ-అమిత్‌ షాలు కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపించారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 04:32 AM