Share News

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఐష్‌బాగ్‌ స్టేడియం

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:06 AM

వంతెన రీడిజైనింగ్‌ కోసం అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు భారతీయ రైల్వే అంగీకరించిందని వారు చెప్పారు

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఐష్‌బాగ్‌ స్టేడియం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఐష్‌బాగ్‌ స్టేడియం సమీపంలో నిర్మించిన ‘లంబకోణ వంతెన’లో మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వంతెన రీడిజైనింగ్‌ కోసం అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు భారతీయ రైల్వే అంగీకరించిందని వారు చెప్పారు. 648 మీటర్ల పొడవు, 8.5మీటర్ల వెడల్పు, రూ.18కోట్లతో ఈ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించారు. దీన్ని ఇంకా ప్రారంభించలేదు. అయితే, వంతెన పైన ఓ చోట 90డిగ్రీల మలుపు ఉండటం తీవ్ర విమర్శలకు కారణమైంది. అలా ఉంటే ప్రమాదాలు జరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

Updated Date - Jun 19 , 2025 | 05:06 AM