Share News

Love: పెళ్లి చేసుకుందామని లవర్‌ను గోవా తీసుకెళ్లాడు. కానీ అక్కడ..

ABN , Publish Date - Jun 18 , 2025 | 06:55 PM

Bengaluru Man: సోమవారం సాయంత్రం స్థానికులు రోషిణి శవాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Love: పెళ్లి చేసుకుందామని లవర్‌ను గోవా తీసుకెళ్లాడు. కానీ అక్కడ..
Bengaluru Man

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి కోసం గోవా వెళ్లారు. సంతోషంగా గడుపుతున్న టైంలో.. ఊహించని దారుణం చోటుచేసుకుంది. పెళ్లి కోసం తీసుకువచ్చిన ప్రియురాలిని ప్రియుడు చంపేశాడు. ప్రియురాల్ని చంపి.. అడవుల్లో పడేశాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే... నార్త్ బెంగళూరుకు చెందిన సంజయ్ కెవిన్ అనే 22 ఏళ్ల యువకుడు..


అదే ప్రాంతానికి చెందిన రోషిణి మోసెస్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి 3 రోజుల క్రితం గోవా వెళ్లారు. కొన్ని గంటల పాటు అక్కడ బాగా ఎంజాయ్ చేశారు. అయితే, ప్రేమ విషయంలో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారు అయింది. రోషిణి మాటకు మాట సమాధానం చెబుతుండటంతో సంజయ్ తట్టుకోలేకపోయాడు. కత్తితో రోషిణి గొంతు కోసేసి చంపేశాడు. తర్వాత శవాన్ని అడవిలోకి తీసుకెళ్లి పారేశాడు.


సోమవారం సాయంత్రం స్థానికులు ఆ శవాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో సంజయ్ గురించి తెలిసింది. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. సంజయ్ చేసిన మర్డర్ ఒప్పుకున్నాడు. ప్రేమ విషయంలో గొడవ కారణంగా హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు.


ఇవి కూడా చదవండి

నీటిపైకి ఓర్ చేప.. ప్రళయం రాబోతోందా?

కమల్ కౌర్ హత్య.. పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు..

Updated Date - Jun 18 , 2025 | 08:45 PM