Share News

తల్లి కోరిక మేరకు 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న బీజేపీ నేత

ABN , Publish Date - Apr 19 , 2025 | 10:12 AM

Bengal BJP Ex President Dilip Ghosh: అయితే, కొడుకు పెళ్లి విషయంలో ఆయన తల్లి బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోమని బతిమాలేది. ఆయన పట్టించుకోలేదు. చివరకు తల్లి మాటకోసం రింకు మజుందార్‌ను పెళ్లి చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం అతికొద్దిమంది బంధు మిత్రుల మధ్య ఈ పెళ్లి జరిగింది.

తల్లి కోరిక మేరకు 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న బీజేపీ నేత
Bengal BJP Ex President Dilip Ghosh

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అన్నది నూటికి నూరు శాతం వాస్తవం. మనం అనుకున్నపుడు పెళ్లి జరగదు.. రాసి పెట్టినపుడే మాత్రమే జరుగుతుంది. దేవుడు మన రాతలో ఎప్పుడు పెళ్లి జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఇందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మాజీ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. 60 ఏళ్ల వయసులో ఆయన తాజాగా పెళ్లి చేసుకున్నారు. ఇన్నేళ్ల పాటు ఒంటరిగా ఉండి.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలియాలంటే పూర్తి స్టోరీ చదివేయాల్సిందే.


పశ్చిమ బెంగాల్‌కు చెందిన దిలిప్ ఘోష్‌కు సీనియర్ బీజేపీ నేతగా రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. గతంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశాడు. ఆయన వయసు ప్రస్తుతం 60 సంవత్సరాలు. నిన్నటి వరకు ఆయన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నారు. అయితే, కొడుకు పెళ్లి విషయంలో ఆయన తల్లి బాధపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోమని బతిమాలేది. ఆయన పట్టించుకోలేదు. కానీ, తల్లి వయసు పైబడుతుండటంతో.. ఆమె కోరిక తీర్చాలని దిలీప్ భావించారు. ఈ నేపథ్యంలోనే రింకు మజుందార్‌ను పెళ్లి చేసుకున్నారు.


శుక్రవారం సాయంత్రం అతికొద్దిమంది బంధు మిత్రుల మధ్య ఈ పెళ్లి జరిగింది. రింకు మజుందార్ విషయానికి వస్తే ఆమె కూడా బీజేపీలో కీలకంగా ఉన్నారు. 2021 నుంచి దిలీప్, రింకులకు పరిచయం ఉంది. ఆ పరిచయంతోటే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లిపై దిలీప్ మాట్లాడుతూ.. ‘ మా అమ్మ నేను పెళ్లి చేసుకోవాలని ఆశ పడింది. ఆమె కోరిక నెరవేర్చడానికి నేను పెళ్లి చేసుకున్నాను. నేను ఇకపై కూడా రాజకీయాల్లో చురగ్గా ఉంటాను. నా వ్యక్తిగత జీవితం కారణంగా రాజకీయ జీవితంపై ప్రభావం ఉండదు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Pushpa 2: పుష్ఫ సినిమా పాటకు మాజీ ముఖ్యమంత్రి భార్య డ్యాన్స్

ఇదేం బుద్ధి తల్లి.. అన్న వరుసయ్యే వ్యక్తితో మహిళ జంప్

Updated Date - Apr 19 , 2025 | 10:16 AM