Dogs: ఇక.. వీధికుక్కలకూ మాంసాహారం.. టెండర్ల ఆహ్వానం
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:21 PM
సిలికాన్ సిటీ బెంగళూరులో వీధికుక్కలకు మాంసాహారం అందించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె టెండర్లు ఆహ్వానించింది. 8 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను ఆహ్వానించారు. రూ.2.88 కోట్లు ఖర్చు చేసేందుకు అంచనా వేశారు.

- బెంగళూరు పాలికెలో రూ.2.88 కోట్ల అంచనా
బెంగళూరు: సిలికాన్ సిటీ బెంగళూరులో వీధికుక్కలకు మాంసాహారం అందించేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలికె(BBMP) టెండర్లు ఆహ్వానించింది. 8 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను ఆహ్వానించారు. రూ.2.88 కోట్లు ఖర్చు చేసేందుకు అంచనా వేశారు. వీధికుక్కలు దాడులు పెరుగుతున్న తరుణంలో వాటికి పౌష్టిక ఆహారం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి డివిజన్‌లోనూ 500 కుక్కలకు ఉదయం లేదా సాయంత్రం ఆహారం అందించేలా నిర్ణయించారు.
ఉదయం 6 నుంచి 11 గంటలు లేదా రాత్రి 8 నుంచి 11 గంటల మధ్యలో ఇవ్వాలని బీబీఎంపీ అధికారులు నిర్ణయించారు. ఇటీవలే కుక్కర్ తిహార్ పేరిట వీధికుక్కలకు ఆహారం అందించే పథకం ప్రారంభించారు. ఇందుకు అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లు, కాలనీల సంఘాలు, హోటల్, రెస్టారెంట్ల యజమానుల సహకారం కోరారు. అయితే ఏ వర్గం నుంచి స్పందన లేకపోవడంతో కుక్కర్ తిహార్‌ను వదిలేశారు.
బీబీఎంపీలో 2.80లక్షల వీధికుక్కలు ఉన్నాయి. కొన్నిచోట్ల వీధికుక్కలకు ఆహారం లభించక జనంపై దాడి చేస్తున్నట్టు గుర్తించారు. అందుకే పాలికె ద్వారానే ఆహారం అందించాలని నిర్ణయించినట్టు బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ (పశుసంవర్ధనా విభాగం అధికారి) సురల్కర్ వికాస్ కిశోర్ తెలిపారు. 8 డివిజన్‌లలో ప్రయోగాత్మకంగా 4వేల వీధికుక్కలకు ఆహారం ఇవ్వదలిచారు. ప్రతి డివిజన్‌లోనూ 100 స్థలాలను గుర్తించారు.
ప్రతి స్థలంలోనూ టెండరు పొందినవారు కుక్కలకు అహారం అందించాల్సి ఉంటుంది. వీధికుక్కలకు 750 కేలరీల పౌష్టికాహారం అవసరం కానుంది. ఈ నిబంధనలకు అనుగుణంగా చికెన్‌రై్‌స, కోడిగుడ్డు, లేదా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వాలని ఉంది. ప్రతి డివిజన్‌లో వీధికుక్కలకు ఆహారం సమకూర్చేందుకు రూ.36 లక్షలు కేటాయించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..
Read Latest Telangana News and National News