Share News

Bayya Sunny Yadav: పాకిస్తాన్ టూర్.. బయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

ABN , Publish Date - May 29 , 2025 | 05:16 PM

Bayya Sunny Yadav: రెండు వారాల క్రితం బయ్యా సన్నీ యాదవ్ బైకుపై పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ అధికారులు గురువారం అతడ్ని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు.

Bayya Sunny Yadav: పాకిస్తాన్ టూర్.. బయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
Bayya Sunny Yadav

ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అరెస్టయ్యాడు. ఎన్ఐఏ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాల క్రితం అతడు బైకుపై పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ అధికారులు గురువారం అతడ్ని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. పాక్ టూరుకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.


గతంలో బెట్టింగ్ కేసు

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా బయ్యా సన్నీ యాదవ్‌పై ఇది వరకే కేసు నమోదు అయింది. మార్చి 5వ తేదీన సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదు అయింది. పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఆ సమయంలో అతడు విదేశాల్లో ఉన్నాడు. రెండు వారాల క్రితం ఇండియా వచ్చాడు. ఇండియా నుంచి పాకిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడ దాదాపు ఏడు రోజుల పాటు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్టు చేశాడు.


ఇవి కూడా చదవండి

యూనీఫామ్ లేని యుద్ధ వీరుడు.. ఆపరేషన్ సిందూర్‌లో జవాన్లకు సాయం..

పుట్‌పాత్‌పై యువకుడ్ని చావగొట్టిన ముగ్గురు యువతులు..

Updated Date - May 29 , 2025 | 06:14 PM