Share News

Barmer Bridegroom: భారత్- పాక్ సరిహద్దు దగ్గరకు ఊరేగింపుగా వరుడు.. ఊహించని షాకిచ్చిన ఆర్మీ..

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:15 PM

Barmer Bridegroom: ఫిబ్రవరి 18వ తేదీన వీసా క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఏప్రిల్ 30వ తేదీన పెళ్లి ఫిక్స్ అయింది. గురువారం పెళ్లి బంధుజనం బరాత్‌తో వాఘా బార్డర్ దగ్గరకు చేరుకున్నారు. అయితే, సైనికాధికారులు వారిని పాకిస్తాన్‌లోకి వెళ్లనివ్వలేదు.

Barmer Bridegroom: భారత్- పాక్ సరిహద్దు దగ్గరకు ఊరేగింపుగా వరుడు.. ఊహించని షాకిచ్చిన ఆర్మీ..
Barmer Bridegroom

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్, బైసరన్ లోయలో నలుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ దుర్మార్గులు 26 మందిని దారుణంగా కాల్చి చంపారు. చనిపోయిన వారిలో 25 మంది ఇండియా వారు కాగా.. ఒకరు నేపాల్‌కు చెందిన వ్యక్తి. ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌కు బుద్ధి చెప్పడానికి భారత్ సిద్దమైంది. పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది. పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తాన్‌లో ఉంటున్న భారతీయుల్ని తిరిగి వచ్చేయాలని విజ్ణప్తి చేసింది. భారత్- పాక్ సంబంధాలు బాగా దెబ్బ తిన్న ఈ నేపథ్యంలో.. ఓ యువకుడి పెళ్లి అర్థాంతంగా ఆగిపోయింది.


బరాత్‌తో పాక్‌లోకి ఎంట్రీ ఇద్దామనుకున్న వరుడికి సైన్యం షాక్ ఇచ్చింది. పెళ్లీ లేదు.. గిల్లీ లేదు పొమ్మంటూ వెనక్కు పంపేసింది. ఈ సంఘటన రాజస్తాన్‌లోని బార్మర్‌కు చెందిన సైన్‌తాన్ సింగ్ జీవితంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని బార్మర్‌కు చెందిన 25 ఏళ్ల సైన్‌తాన్ సింగ్‌కు పాకిస్తాన్, సింధు ప్రావిన్స్‌లోని అమర్ కోట్ జిల్లాకు చెందిన కేశర్ కన్వర్ అనే యువతితో నాలుగేళ్ల క్రితం పెళ్లి నిశ్చయం అయింది. నిశ్చితార్థం కూడా పూర్తయింది. పాకిస్తాన్ వెళ్లడానికి వీసాలు అప్లై చేసి, క్లియరెన్స్ రావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఫిబ్రవరి 18వ తేదీన వీసా క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఏప్రిల్ 30వ తేదీన పెళ్లి ఫిక్స్ అయింది.


గురువారం పెళ్లి బంధుజనం బరాత్‌తో వాఘా బార్డర్ దగ్గరకు చేరుకున్నారు. అయితే, సైనికాధికారులు వారిని పాకిస్తాన్‌లోకి వెళ్లనివ్వలేదు. ఎంత బతిమలాడినా ఒప్పుకోలేదు. వెనక్కు తిప్పి పంపేశారు. దీంతో వరుడు షాక్ తిన్నాడు. నాలుగేళ్ల ఎదురు చూపులకు బ్రేక్ పడటంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సైన్‌తాన్ సింగ్‌ మాట్లాడుతూ.. ‘ మేము ఈ పెళ్లి కోసం నాలుగేళ్లు ఎదురు చూశాం. అన్ని లీగల్ పద్దతుల్ని ఫాలో అయ్యాము. అయినా ఇప్పుడిలా జరిగింది. అంతా ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు’ అంటూ బాధపడ్డాడు.


ఇవి కూడా చదవండి

Rahul Gandhi: భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Shruti Haasan: పాపం శృతి హాసన్.. సీఎస్‌కే ఓటమిని తట్టుకోలేకపోయింది..

Updated Date - Apr 26 , 2025 | 05:16 PM