Murshidabad: ఆదుకుంటాం.. ముర్షీదాబాద్ బాధితులకు బెంగాల్ గవర్నర్ భరోసా
ABN , Publish Date - Apr 19 , 2025 | 09:39 PM
అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి యథాపూర్వ పరిస్థితి నెలకొనాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ అన్నారు.

కోల్‌కతా: ముర్షీదాబాద్ హింసాకాండ (Murshidabad Violence)ను పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ (CV Ananda Bose) ఖండించారు. ఇది అనాగరిక చర్య అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదని అన్నారు. అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి యథాపూర్వ పరిస్థితి నెలకొనాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ముర్షీదాబాద్ హింసాకాండలో బాధితులను పరామర్శించేందుకు గవర్నర్ శనివారంనాడు ధులియాన్ వచ్చారు.
Nishikant Dubey: చట్టాలు వాళ్లే చేస్తే పార్లమెంటు మూసేయాలి.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
''ఇది అనాగరిక చర్య. మళ్లీ ఇలాంటివి జరక్కూడదు. ప్రజలు భయంతో ఉన్నారు. బాధిత ప్రాంతాల్లో తిరిగి యథాపూర్వ పరిస్థితి నెలకొనాలి. తమను కాపాడేందుకు ఒకరున్నారనే భరోసా వారికి కల్పించాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్చలు తీసుకోవాల్సి ఉంది. చాలా డిమాండ్లు వస్తున్నాయి. ఇక్కడ శాశ్వతంగా ఒక బీఎస్ఎఫ్ క్యాంపును ఏర్పాటు చేయాలనేది ఇందులో ఒక ప్రధానమైన డిమాండ్'' అని మీడియాతో మాట్లడుతూ గవర్నర్ చెప్పారు.
కాగా, హింసాత్మక ఘటనలపై అట్టుడిగిన ముర్షీదాబాద్ ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ తన టీమ్‌తో కలిసి పర్యటించారు. మూడు రోజుల పాటు మాల్డా, ముర్షీదాబాద్ సహా బాధిత ప్రాంతాల్లో ఎన్‌సీడబ్ల్యూ టీమా పర్యటించి బాధితుల ఇబ్బందులను, వారి డిమాండ్లను తెలుసుకోనుంది. ఇక్కడ పరిస్థితిపై ఒక నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని, ప్రజల డిమాండ్లను వారి దృష్టికి తెస్తామని రహత్కర్ తెలిపారు.
వక్ఫ్ చట్టంపై నిరసనల సందర్భంగా ఏప్రిల్ 11న ముర్షీబాదాలో హింసాకాండ చెలరేగింది. ఆందోళనకారుల దాడిలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. నిరసనలు మాల్దా, ముర్షీదాబద్, సౌత్ 24 పరకాలు, హుగ్లీ జిల్లాలకు కూడా విస్తరించి దహనకాండలు, రాళ్లు రువ్వడం, రోడ్ల దిగ్బంధం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు కుటుంబాలు భయంతో జార్ఖాండ్‌లని పకూర్ జిల్లాకు పారిపోగా, మరికొందరు మాల్డాలోని సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..