Share News

Posting Girls Photo on Status: బాలిక ఫొటోలు స్టేటస్ పెట్టిన యువకుడు.. చావగొట్టిన అన్న..

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:02 PM

Posting Girls Photo on Status: బాలిక అన్న గాల్లో ఎగిరెగిరి దొడ్డ బసవను కొట్టాడు. మిగిలిన వాళ్లు బెల్టులు, క్రికెట్ బ్యాట్లతో అతడిపై దాడి చేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డ దొడ్డ బసవ ఆస్పత్రిలో చేరాడు.

Posting Girls Photo on Status: బాలిక ఫొటోలు స్టేటస్ పెట్టిన యువకుడు.. చావగొట్టిన అన్న..
Posting Girls Photo on Status

ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల వరకు వాట్సాప్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కేవలం సమాచారం షేర్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. మనసులోని భావాలను పంచుకోవడానికీ వాట్సాప్ వేదికగా మారిపోయింది. జనం మంచి, చెడులను వాట్సాప్ స్టేటస్‌ల రూపంలో పెట్టేస్తున్నారు. అయితే, కొంతమంది హద్దులు మీరి ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. ఇతరులకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను స్టేటస్ పెట్టేస్తున్నారు.


తాజాగా, ఒక యువకుడు ఓ బాలిక ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. దీంతో ఆగ్రహించిన బాలిక అన్న సదరు యువకుడిపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా చావగొట్టాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బళ్లారి సిటీకి చెందిన దొడ్డ బసవ అనే 19 ఏళ్ల యువకుడు రేడియో పార్క్‌లో ఉన్న ఐటీఐ కాలేజీలో చదువుతున్నాడు. అతడు ఓ మైనర్ బాలికకు చెందిన ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు.


దీంతో బాలిక అన్న దొడ్డ బసవను నిలదీశాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్యా మాటల యుద్ధం మొదలైంది. కొద్దిసేపటి తర్వాత బాలిక అన్న అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఫ్రెండ్స్‌ను వెంటబెట్టుకుని తిరిగొచ్చాడు. ఐటీఐ కాలేజీ క్యాంపస్‌లో దొడ్డ బసవపై వారంతా దాడి చేశారు. బాలిక అన్న గాల్లో ఎగిరెగిరి దొడ్డ బసవను కొట్టాడు. మిగిలిన వాళ్లు బెల్టులు, క్రికెట్ బ్యాట్లతో అతడిపై దాడి చేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డ దొడ్డ బసవ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

మురికి నీళ్లలో పడిపోయిన కూతురు.. తండ్రి చేసిన పనికి అందరూ షాక్..

ఇజ్రాయెల్ దాడిలో గాజాకు చెందిన 18 మంది సామాన్యులు మృతి

Updated Date - Aug 03 , 2025 | 05:57 PM