Share News

IndiGo Flight: ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి మాయం.. అసలేం జరిగింది..

ABN , Publish Date - Aug 02 , 2025 | 05:23 PM

అసోంలోని కాచర్‌ జిల్లాకు చెందిన హుస్సేన్‌ అహ్మద్‌ మజుందార్‌ గురువారం ఇండిగో 6E-2387 విమానంలో ముంబై నుంచి కోల్‌కతా మీదుగా సిల్చార్‌కు ప్రయాణించాడు. అయితే విమాన ప్రయాణ సమయంలో ఓ వ్యక్తి హుస్సేన్ చెంపపై బలంగా కొట్టాడు.

IndiGo Flight: ఇండిగో విమానంలో చెంపదెబ్బ తిన్న వ్యక్తి మాయం.. అసలేం జరిగింది..
Assam man slapped IndiGo Flight

ఇండిగో విమానంలో (Indigo Flight) ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుడితో చెంపదెబ్బ తిన్న ప్రయాణికుడు అదృశ్యం (Missing) కావడం కలకలం సృష్టిస్తోంది. ముంబై నుంచి కోల్‌కతా (Mumbai to Kolkata) వెళ్తున్న ఇండిగో విమానంలో తోటి ప్రయాణికుడితో చెంపదెబ్బ తిన్న వ్యక్తి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసోంకు (Assam) చెందిన 32 ఏళ్ల హుస్సేన్ అహ్మద్ అనే వ్యక్తి కోల్‌కతా మీదుగా సిల్చార్ వెళ్లేందుకు ముంబైలో గురువారం ఈ విమానం ఎక్కాడు.


అసోంలోని కాచర్‌ జిల్లాకు చెందిన హుస్సేన్‌ అహ్మద్‌ మజుందార్‌ గురువారం ఇండిగో 6E-2387 విమానంలో ముంబై నుంచి కోల్‌కతా మీదుగా సిల్చార్‌కు ప్రయాణించాడు. అయితే విమాన ప్రయాణ సమయంలో ఓ వ్యక్తి హుస్సేన్ చెంపపై బలంగా కొట్టాడు. విమానం కోల్‌కతా చేరుకున్న తర్వాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ హుస్సేన్ ఇంటికి వెళ్లలేదని అసోంలోని అతడి ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. అతడి ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


హుస్సేన్ ముంబైలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఇంటికి వస్తున్న హుస్సేన్‌ను రిసీవ్ చేసుకునేందుకు కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం సిల్చార్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళారు. అయితే వారికి హుస్సేన్ ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడా కనిపించలేదు. విమానంలో చెంబదెబ్బ తిన్న హుస్సేన్ వీడియో వైరల్ కావడంతో అతన్ని సంప్రదించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే హుస్సేన్ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చినట్లు ఆయన తండ్రి అబ్దుల్ మన్నన్ మజుందార్ తెలిపారు. ఇండిగో, విమానాశ్రయ అధికారులు కూడా తమ కుమారుడి ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వాపోయారు. ఈ ఘటనపై ఉదయర్‌బాండ్‌ పోలీసులు మిస్సింగ్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

ఓటర్ల జాబితాలో నా పేరు లేదన్న తేజస్వి.. ఈసీ కౌంటర్

పాతాళ లోకంలో దాగినా వదలబోం.. మళ్లీ దాడి చేస్తే మాత్రం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 05:23 PM