Share News

Assam PoliticS: గౌరవ్‌ గొగోయ్‌కు పాక్‌తో లింకులు

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:11 AM

ఆపరేషన్‌ సిందూర్‌ పై పార్లమెంటులో జరిగిన చర్చలో ప్రధాని మోదీ సహా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ.

Assam PoliticS: గౌరవ్‌ గొగోయ్‌కు పాక్‌తో లింకులు

గువాహటి, జూలై 30: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పార్లమెంటులో జరిగిన చర్చలో ప్రధాని మోదీ సహా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతూ.. అసోంకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ నిప్పులు చెరిగారు. అయితే.. ఆ మర్నాడే(బుధవారం) ఆయనపై అసోం సీఎం హిమంతబిశ్వశర్మ మరో రూపంలో సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ గౌరవ్‌, ఆయన భార్య ఎలిజబెత్‌ కోల్బర్న్‌ గొగోయ్‌ సహా వారి కుటుంబానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంపై ఎన్‌ఐఏతో లోతైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ‘‘పాకిస్థాన్‌ తరఫున గొగోయ్‌ వకాల్తా పుచ్చుకున్నారు. ఆ దేశం తరఫున పనిచేస్తున్నారు. ఆయన భార్య ఎలిజబెత్‌ నేతృత్వంలో ఎన్‌జీవోకు కూడా పాక్‌తో లింకులు ఉన్నాయి’’ అని ఆరోపించారు. ‘‘గౌరవ్‌ భార్య, ఇద్దరు పిల్లలకు విదేశీ పౌరసత్వం ఉంది. ఆయన ఎప్పుడైనా దేశాన్ని వీడి వెళ్లిపోయే అవకాశముంది.’’ అని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 04:11 AM