Army Nursing College: పాక్ మరో దుశ్చర్య.. ఈ సారి ఆర్మీ కాలేజీ వెబ్ సైట్ హ్యాక్..
ABN , Publish Date - Apr 25 , 2025 | 06:46 PM
Army Nursing College: గతంలోనూ టీమ్ ఇంసేన్ పాక్ గ్రూపు గతంలోనూ సైబర్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వ, ఇతర వెబ్ సైట్లను హ్యాక్ చేయడానికి ఈ గ్రూపు ప్రయత్నించింది. 2023 జీ20 సమ్మిట్ సమయంలోనూ ప్రభుత్వ వెబ్ సైట్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తరచుగా సైబర్ దాడులకు పాల్పడుతూ విఫలం అవుతూ వస్తోంది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పే ప్రయత్నంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది. సింధు జలాల సరఫరాను కూడా నిలిపివేసింది. భారత్ తీసుకునే నిర్ణయాలతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది. అయితే ఇంత జరుగుతున్నా పాకిస్తాన్‌కు మాత్రం బుద్ధిరావటం లేదు. పాడు పనులు చేస్తూనే ఉంది. పాకిస్తాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు .. ఆర్మీకి చెందిన కాలేజీ వెబ్ సైట్‌ను హ్యాక్ చేశారు. ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్ సైట్‌ను పాకిస్తాన్‌కు చెందినట్లుగా భావిస్తున్న కొందరు హ్యాకర్లు హ్యాక్ చేశారు.
అంతేకాదు.. ‘ యూ ఆర్ హ్యాక్డ్ ’ అంటూ వెబ్ సైట్ హోం పేజీలో ఓ మెసేజ్‌ను కూడా వదిలారు. అందులో ‘టీమ్ ఇంసేన్ పాక్’ అని ఉంది. ఈ నేపథ్యంలో ఆర్మీ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సాయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. గతంలోనూ టీమ్ ఇంసేన్ పాక్ గ్రూపు సైబర్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వ, ఇతర వెబ్ సైట్లను హ్యాక్ చేయడానికి ఈ గ్రూపు ప్రయత్నించింది. 2023 జీ20 సమ్మిట్ సమయంలోనూ ప్రభుత్వ వెబ్ సైట్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తరచుగా సైబర్ దాడులకు పాల్పడుతూ విఫలం అవుతూ వస్తోంది.
తెలంగాణలోని పాకిస్తానీలకు డీజీపీ ఆదేశాలు
భారతదేశంలో ఉంటున్న పాకిస్తానీల వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ తెలంగాణలోని పాకిస్తానీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలన్నారు. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవని స్పష్టం చేశారు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉందన్నారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదని తెలిపారు.
ఇవి కూడా చదవండి
Ananya Nagalla: మధుసూదన రావుకు నివాళులు అర్పించిన హీరోయిన్ అనన్య నాగళ్ల
Telangana Police: పాకిస్తానీలు వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి.. తెలంగాణ డీజీపీ ఆదేశాలు