MK Stalin: ఎప్పటికీ ఢిల్లీకి తలొగ్గే ప్రసక్తి లేదు: స్టాలిన్
ABN , Publish Date - Apr 18 , 2025 | 09:45 PM
రాష్ట్రాల హక్కులను డిమాండ్ చేయడంలో తప్పేముందని స్టాలిన్ ప్రశ్నించారు. గత్యంతరం లేకనే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు కారణంగానే సుప్రీంకోర్టుకు వెళ్లామని, అత్యున్నత న్యాయస్థానం దానిపై చారిత్రక తీర్పునిచ్చిందని చెప్పారు.

చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం, 2026 ఎన్నికల్లో తమ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) వ్యాఖ్యానించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తిప్పికొట్టారు. ఢిల్లీ పరిపాలనకు లొంగని చరిత్ర తమిళనాడుదని అన్నారు. శుక్రవారంనాడు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్ర విద్యార్థులకు 'నీట్' నుంచి మినహాయింపు ఇవ్వగలమని అమిత్‌షా హామీ ఇస్తారా? హిందీని బలవంతంగా రుద్దే ప్రసక్తి లేదని చెప్పగలరా? నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడుకు ప్రాతినిధ్యం తగ్గదని హామీ ఇవ్వగలరా? అని ముఖ్యమంత్రి వరుస ప్రశ్నలు గుప్పించారు.
Amit Shah: ఇక మిలిగినవి నాలుగు జిల్లాలే.. నక్సల్ లొంగిపోవాలని అమిత్‌షా పిలుపు
రాష్ట్రాల హక్కులను డిమాండ్ చేయడంలో తప్పేముందని స్టాలిన్ ప్రశ్నించారు. గత్యంతరం లేకనే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు కారణంగానే సుప్రీంకోర్టుకు వెళ్లామని, అత్యున్నత న్యాయస్థానం దానిపై చారిత్రక తీర్పునిచ్చిందని చెప్పారు. తమిళనాడు కేవలం తనకోసం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతోందన్నారు. డీఎంకే సత్తా ఏమిటో తమిళనాడు ప్రజలే కాకుండా యావద్దేశ ప్రజలు సైతం ఇప్పుడు గుర్తించారని చెప్పారు.
అమిత్ షా కానీ, మరే షా కానీ...
ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తమిళనాడులో పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను కూల్చడం అమిత్‌షా వల్ల కానీ మరే ఇతర 'షా'ల వల్ల కానీ కాదని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. 2026లోనూ డీఎంకేనే అధికారంలోకి వస్తుందన్నారు. ''తమిళనాడు ఎన్నటికీ ఢిల్లీకి తలొగ్గే ప్రసక్తి లేదు. ఇక్కడ కొద్దిమందిని బెదిరించి పొత్తు పెట్టుకోవడం ద్వారా గెలవగలమని అనుకుంటున్నారేమో? మొత్తం మీ పూర్తి బలగాలను తెచ్చుకున్నా సరే, ఎవరు గెలుస్తారో చూద్దాం'' అని స్టాలిన్ సవాలు విసిరారు.
ఇవి కూడా చదవండి..