Hero Ajith: పొలిటికల్ ఎంట్రీపై హీరో అజిత్ ఆసక్తికర కామెంట్స్..
ABN , Publish Date - May 03 , 2025 | 11:54 AM
పొలిటికల్ ఎంట్రీపై హీరో అజిత్ తన మనసులో మాట చెప్పేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని, ఈ విషయంలో నటీనటులకు ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

- నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆశ లేదు..
- విజయ్ నిర్ణయం సాహసోపేతం
- నటుడు అజిత్
చెన్నై: ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని, ఈ విషయంలో నటీనటులకు ఎలాంటి ఆంక్షలు లేవని సినీ నటుడు అజిత్(Ajith) వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలనే ఆశ తనకు లేదని, అదే సమయంలో తన మిత్రుడు విజయ్ రాజకీయ ప్రవేశం చేయడం అత్యంత సాహసోపేతమైన చర్య ఆయన ప్రశంసించారు. సినీ రంగంలో ప్రవేశించి 33 యేళ్లు పూర్తయిన సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: ‘క్రిప్టో’ బాధితుడికి అధికారుల అండ
రాజకీయాల్లో ప్రవేశించే సినీ కళాకారులకు తాను శుభాకాంక్షలు చెబుతానని,, అంతేకాని తనకు రాజకీయాల్లో రావాలనే ఉద్దేశం మాత్రం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మార్పు తీసుకు రాగలమనే నమ్మకంతో రాజకీయ ప్రవేశం చేసేవారంతా విజయం సాధించాలనే కోరుకుంటానని చెప్పారు. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం విభిన్నమతాలు, విభిన్నజాతులవారు, విభిన్నభాషలకు చెందినవారంతా సామరస్యంగా జీవిస్తున్నారని, వీరందరినీ ఏకతాటిపై నడిపించడం రాజకీయనేతలకే సాధ్యమవుతుందన్నారు.
రాష్ట్రపతి భవన్‌లో పాటించాల్సిన నియమాలు, అక్కడి భద్రతా ఏర్పాట్లు చూసి తాను ఆశ్చర్యపోయానని, నాయకులంతా తమ జీవనయానాన్ని ఎలా సాగిస్తున్నారో అప్పుడే తనకు అవగతమైందన్నారు. ఆ నాయకులను చూసి తాను అసూయపడలేదని, ఓ దేశాన్ని, లేదా ఓ రాష్ట్రాన్ని భుజాలపై మోయటం కష్టసాధ్యమని తెలుసుకున్నాననన్నారు. అందుకనే తాను నటుడు విజయ్ రాజకీయ ప్రవేశం చేయడం సాహసోపేతమైన నిర్ణయమని చెబుతున్నానని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్
Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!
Read Latest Telangana News and National News