Air India: ల్యాండ్ అయిన కాసేపటికే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
ABN , Publish Date - Jul 22 , 2025 | 07:37 PM
హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. దీంతో ఎయిర్‌లైన్ నిర్వహణ, విమానాల తనిఖీలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీ, జులై 22: హాంకాంగ్ నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI315 ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే మంటల్లో చిక్కుకుంది. ఆక్సిలరీ పవర్ యూనిట్(APU)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం గేట్ దగ్గర ఆగి, ప్రయాణికులు దిగడం ప్రారంభించిన తర్వాత మంటలు రేగాయని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. విమానంలోని ప్రయాణీకులందరూ సాధారణంగానే దిగిపోయాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానానికి కొంత మేర నష్టం జరిగినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. తదుపరి దర్యాప్తు కోసం విమానం నిలిపివేశామని సంస్థ తన X ఖాతాలో చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఈ ప్రమాదం తర్వాత ఎయిర్‌లైన్ నిర్వహణ, విమానాల తనిఖీలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 260 మంది మరణించిన తర్వాత ఎయిర్ ఇండియాపై తీవ్ర నిఘా కొనసాగుతుండగా ఈ ఘటన జరిగింది.
కాగా, నిన్న ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై గంటకు 155 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు సాంకేతిక సమస్య తలెత్తడంతో సర్వీసు రద్దు చేశారు. ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. 160 మంది ప్రయాణికులతో కూడిన ఎయిర్‌బస్ A321 విమానం ఈ ప్రమాదంలో చిక్కుకుంది. రాత్రి 7:30 గంటలకు బయలుదేరాల్సిన విమానం. టేకాఫ్ నిలిపివేసిన తర్వాత అందరు ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దింపేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News