
Air India plane crash: నేను లేచేసరికి నా చుట్టూ విమాన శకలాలు ఉన్నాయి: బిశ్వాస్‌కుమార్ రమేష్
ABN , First Publish Date - Jun 12 , 2025 | 03:28 PM
Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 230 మందికి పైగా ప్రయాణికులతో లండన్ బయలుదేరిన విమానం.. నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తుంది..

Live News & Update
-
Jun 12, 2025 23:49 IST
డీఎన్‌ఏ టెస్టులు చేశాకే మృతుల గురించి ప్రకటిస్తాం: హోం మంత్రి అమిత్ షా
డీఎన్‌ఏ టెస్టులు చేశాకే విమాన ప్రమాద మృతుల గురించి ప్రకటిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఎయిరిండియా విమానం కుప్పకూలిన దుర్ఘటనపై అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో ఆస్పత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. తర్వాత ఆయన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎయిరిండియా-171 విమానం కూలిపోయింది. విమానంలో 230మంది ప్రయాణికులు ఉన్నారు. 12మంది సిబ్బంది. ఈ ప్రమాదం నుంచి ఒకరు క్షేమంగా బయటపడ్డ అతడిని కలిశాను. మృతుల గురించి తెలుసుకొనేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేస్తున్నామని హోంమంత్రి చెప్పారు. ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని అమిత్ షా చెప్పారు. విమానం పేలిన వెంటనే మంటలు వ్యాపించడంతో ఎవరినీ కాపాడే పరిస్థితిలేకుండా పోయిందని అమిత్ షా వెల్లడించారు.
-
Jun 12, 2025 21:28 IST
కేవలం 59 సెకన్లలో డ్రీమ్స్ నుండి డెత్ వరకు
241 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా విమానం
టేకాఫ్ అవుతున్న, కూలిపోతున్న దృశ్యాలు అక్కడున్న CCTV ఫుటేజ్‌లో రికార్డు
టేకాఫ్ నుండి క్రాష్ వరకు సీసీటీవీ ఫుటేజ్
-
Jun 12, 2025 21:21 IST
విమాన ప్రమాద స్థలికి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.
హోం మంత్రి అమిత్ షాతో కలిసి ప్రమాద పరిశీలన.
ప్రమాద కారణాలపై దర్యాప్తు వేగవంతం.
-
Jun 12, 2025 20:31 IST
విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కూలింది: బిశ్వాస్‌కుమార్ రమేష్
నేను UK పౌరుడిని, లండన్‌లో 20 ఏళ్లుగా ఉంటున్నా: బిశ్వాస్‌కుమార్ రమేష్
కుటుంబాన్ని కలిసి వెళ్దామని భారత్ వచ్చా: బిశ్వాస్‌కుమార్ రమేష్
నేను లేచేసరికి నా చుట్టూ విమాన శకలాలు ఉన్నాయి: బిశ్వాస్‌కుమార్ రమేష్
నా తమ్ముడు కూడా విమానంలోనే ఉన్నాడు: బిశ్వాస్‌కుమార్ రమేష్
-
Jun 12, 2025 19:57 IST
విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ఎక్స్‌గ్రేషియా
రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్
క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ భరిస్తాం: టాటా గ్రూప్
బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తాం: టాటా గ్రూప్
-
Jun 12, 2025 19:35 IST
మృత్యుంజయుడు..
విమాన ప్రమాదం నుంచి ఒకరు బయటపడ్డారు: అహ్మదాబాద్ సీపీ
11A సీటు ప్రయాణికుడు రమేష్ బయటపడ్డారు: అహ్మదాబాద్ సీపీ
ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స: సీపీ
ప్రమాద మృతుల సంఖ్యపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: సీపీ
నివాస ప్రాంతంలో కూలినందున మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుంది: సీపీ
-
Jun 12, 2025 19:25 IST
Air India Plane Crash: స్పందించిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి..
ముంబై: ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాయని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ శిండే తెలిపారు. విమానంలో మహారాష్ట్రకు చెందిన అనేక మంది ప్రయాణికులు ఉన్నందున, వారి బంధువులకు సమాచారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలిపిన షిండే.. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటన స్థలానికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే.. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు ఉప ముఖ్యమంత్రి షిండే.
-
Jun 12, 2025 17:47 IST
విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే..
-
Jun 12, 2025 17:45 IST
విమాన ప్రమాదంపై అసోసియేటెడ్ ప్రెస్ ప్రకటన
విమాన ప్రమాదంలో ఒక్కరూ బతకలేదు: అసోసియేటెడ్ ప్రెస్
అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపిన అహ్మదాబాద్ సీపీ
-
Jun 12, 2025 17:31 IST
అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి సీఎం భూపేంద్ర పటేల్
విమాన ప్రమాద క్షతగాత్రులకు భుపేంద్ర పటేల్ పరామర్శ
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: భూపేంద్ర పటేల్
విమాన ప్రమాద ఘటన దురదృష్టకరం: భూపేంద్ర పటేల్
-
Jun 12, 2025 17:30 IST
విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి
ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసింది: రాష్ట్రపతి ముర్ము
బాధిత కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది: రాష్ట్రపతి
-
Jun 12, 2025 17:30 IST
విమాన ప్రమాదంపై స్పందించిన భారత్‌లోని UK హైకమిషన్
బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన యూకే హైకమిషన్.
స్థానిక అధికారులతో కలిసి పరిస్థితి పర్యవేక్షిస్తున్న UK హైకమిషన్.
-
Jun 12, 2025 17:27 IST
అహ్మదాబాద్: ప్రమాదస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
సహాయకచర్యల్లో బీఎస్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
విమానయానశాఖ కంట్రోల్ రూమ్- 011-24610843, 9650391859
ఎయిరిండియా హెల్ప్ లైన్- 1800 5691 444
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు హెల్ప్ లైన్: 99741 11327
-
Jun 12, 2025 17:23 IST
ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఇదే AI విమానానికి సాంకేతిక సమస్య
2024 జూన్ 6, డిసెంబర్‌లో రెండుసార్లు తలెత్తిన సాంకేతిక సమస్య
సాంకేతిక సమస్యపై ఎయిరిండియాకు DGCA లేఖ
DGCA లేఖను పట్టించుకోని ఎయిరిండియా
DGCA హెచ్చరించినా అదే విమానాన్ని కొనసాగించిన AI
చివరిగా మూడోసారి ఇవాళ అదే AI విమానానికి ప్రమాదం
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి
-
Jun 12, 2025 17:11 IST
విమాన ప్రమాదం.. వెలుగులోకి సంచలన వీడియో..
ఢిల్లీ నుంచి లండన్ వయా అహ్మదాబాద్ AI విమానం
విమానంలో లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తంచేసిన ప్రయాణికుడు
ఢిల్లీలో బయల్దేరి అహ్మదాబాద్‌లో దిగేసిన ప్రయాణికుడు ఆకాష్
ఎక్స్‌లో కూడా పోస్ట్ చేసిన ప్రయాణికుడు ఆకాష్
2 గంటల ముందే లోపం ఉందని AIకి సమాచారం ఇచ్చా: ఆకాష్
-
Jun 12, 2025 16:42 IST
విమాన ప్రమాదంపై స్పందించిన రాహుల్ గాంధీ..
-
Jun 12, 2025 16:37 IST
కుప్పకూలిన విమానం.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..
-
Jun 12, 2025 16:17 IST
విమానం కుప్పకూలిన దృశ్యం..
-
Jun 12, 2025 16:15 IST
విమానం కుప్పకూలిన ప్రదేశం ఇదే..
-
Jun 12, 2025 16:08 IST
విమాన ప్రమాదానికి కారణమదేనా..?
-
Jun 12, 2025 16:07 IST
కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలిన విమానం..
-
Jun 12, 2025 16:05 IST
ప్రమాదం జరిగిందిలా..
-
Jun 12, 2025 16:02 IST
ప్రమాదానికి గురైన విమానం వివరాలు..
ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా 171 విమానం పూర్తి వివరాలివే. ఈ విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ VT-ANB, సీరియల్ నెంబర్ 36279. ఈ విమానం జనవరి 2014లో ఎయిర్ ఇండియాకు డెలివరీ చేశారు.
-
Jun 12, 2025 15:56 IST
విమాన ప్రమాదంపై స్పందించిన మంత్రి లోకేష్..
-
Jun 12, 2025 15:55 IST
అమరావతి: విమాన ప్రమాదంపై స్పందించిన సీఎం చంద్రబాబు
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. ‘అహ్మదాబాద్‌లో విమానం ప్రమాదంతో షాక్‌కు గురయ్యాను. చనిపోయిన ప్రయాణికుల కుటుంబాలకు, సిబ్బంది కుటుంబాలకు, స్థానిక ప్రజల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి’ అంటూ పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబు.
-
Jun 12, 2025 15:52 IST
ఢిల్లీ: అహ్మదాబాద్‌కు బయలుదేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
విమానం కూలిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమిత్ షా.
మరి కాసేపట్లో సంఘటన స్థలాన్ని పరిశీలించనున్న హోంమంత్రి అమిత్ షా.
-
Jun 12, 2025 15:48 IST
అహ్మదాబాద్: బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కూలిన విమానం
విమాన ప్రమాదంలో పలువురు మెడికోలు మృతి?
-
Jun 12, 2025 15:44 IST
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం
ప్రయాణికులు సహా మొత్తం 242 మంది మృతి చెందినట్లు సమాచారం.
మృతుల్లో 230 మంది ప్రయాణికులు సహా 12 మంది సిబ్బంది.
మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ.
మృతుల్లో 169 మంది భారతీయులు.
మృతుల్లో 53 మంది బ్రిటన్, ఏడుగురు పోర్చుగీసు, ఒకరు కెనడియన్.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ప్రమాదం.
మ.1.38 గంటలకు టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం.
టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిన విమానం.
సహాయకచర్యల్లో NDRF బృందాలు, ఫైరింజన్లు, అంబులెన్స్‌లు.
ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్‌డెస్క్- 1800 5691 444.
-
Jun 12, 2025 15:41 IST
ప్రధాని మోదీ రాజీనామా చేయాలి: సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్
1950 రైలుప్రమాద ఘటనలో లాల్‌బహదూర్‌శాస్త్రి రాజీనామా చేశారు.
విమాన ప్రమాదానికి బాధ్యతగా మోదీ రాజీనామా చేయాలి.
-
Jun 12, 2025 15:38 IST
అహ్మదాబాద్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB)
ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్న AAIB
-
Jun 12, 2025 15:37 IST
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
-
Jun 12, 2025 15:36 IST
విమాన ప్రమాదం దురదృష్టకరం: ఎయిరిండియా చైర్మన్
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.
ప్రయాణికుల వివరాల కోసం ఎయిరిండియా హెల్ప్‌డెస్క్.
-
Jun 12, 2025 15:35 IST
అమిత్ షా, రామ్మోహన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ
విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా
హుటాహుటిన ఘటనాస్థలికి బయల్దేరాలని మోదీ ఆదేశం
-
Jun 12, 2025 15:34 IST
సాయంత్రం 5 గంటల వరకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు మూసివేత
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సా.5 వరకు టేకాఫ్స్, ల్యాండింగ్స్ నిలిపివేత
-
Jun 12, 2025 15:32 IST
గుజరాత్ సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
విమాన ప్రమాదానికి కారణాలపై అమిత్ షా ఆరా
-
Jun 12, 2025 15:31 IST
విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్‌కు గురయ్యా: రామ్మోహన్
వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నా.
అవసరమైన అన్ని సహాయకచర్యలు చేపడుతున్నాం.
విజయవాడలో ఉన్న పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్.
ప్రధాని మోదీతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.
హుటాహుటిన అహ్మదాబాద్ బయల్దేరిన రామ్మోహన్‌నాయుడు.
-
Jun 12, 2025 15:28 IST
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం
మేఘానిలోని షాహీబాగ్ హోటల్ సమీపంలో కూలిన విమానం.
ప్రమాదంలో 200 మందికి పైగా మృతిచెందినట్లు అనుమానం.
స్థానిక ఆస్పత్రికి 30 మృతదేహాలు తరలింపు.
కూలిన ఎయిరిండియా-171 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం.
ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు.
విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు శిశువులు.
విమానంలో పైలట్ సుమిత్ సబర్వాల్, కోపైలట్ సహా 12 మంది సిబ్బంది.
కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం రూపాని.
కూలిన ఎయిరిండియా విమానంలో 169 మంది భారతీయులు.
విమానంలో 52 మంది బ్రిటన్, ఏడుగురు పోర్చుగీసు, ఒకరు కెనడా దేశస్థుడు.