Ahmedabad Plane Crash: విమానం ల్యాండింగ్ గేర్ అలా ఎందుకుంది.. దాని అర్థం ఏమిటి..
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:55 PM
అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా విమానం దుర్ఘటన జరిగిన నెలరోజుల తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. కేవలం సాంకేతిక వైఫల్యాలను మాత్రమే కాకుండా కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న గందరగోళం, పైలట్ల నిస్సహాయతను కూడా ఈ నివేదిక తెలియజేసింది.

అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా విమాన ప్రమాద (Ahmedabad Plane Crash) దుర్ఘటన జరిగిన నెలరోజుల తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. కేవలం సాంకేతిక వైఫల్యాలను మాత్రమే కాకుండా కాక్‌పిట్‌లో చోటుచేసుకున్న గందరగోళం, పైలట్ల నిస్సహాయతను కూడా ఈ నివేదిక తెలియజేసింది. ఈ నివేదికలోని మరో ముఖ్యమైన విషయం.. విమానం ల్యాండింగ్ గేర్ లివర్ 'డౌన్' పొజిషన్‌లో ఉన్నట్టు చూపిస్తున్న ఓ ఫొటో. ఈ ఫొటో చాలా మంది నిపుణులలో అనుమానాలను రేకెత్తిస్తోంది (Plane Landing gear lever).
ల్యాండింగ్ గేర్ లివర్ అనేది విమానం కాక్‌పిట్‌లో కీలకమైన నియంత్రణ యంత్రాంగం. ఇది విమానం ల్యాండింగ్ గేర్ వ్యవస్థను నిర్వహిస్తుంది. ఈ ల్యాండింగ్ గేర్ వ్యవస్థలో చక్రాలు, స్ట్రట్‌లు, విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విమానానికి మద్దతుగా నిలిచే ఇతర భాగాలు ఉంటాయి. విమానం రన్ వేపై ఉన్నప్పుడు ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో చక్రాల నుంచి విమానానికి అవసరమైన మద్ధతు కోసం ఆ ల్యాండింగ్ గేర్ లివర్ కాన్ఫిగరేట్ అవుతుంది. ల్యాండింగ్ గేర్ లివర్ డౌన్‌లో ఉందంటే.. ల్యాండింగ్ గేర్ విమాన స్థితికి అనుగుణంగా వ్యవస్థలను నియంత్రిస్తోందని, లాక్ అయి ఉందని అర్థం.
సాధారణంగా విమానం గాల్లోకి లేచిన వెంటనే పైలట్లు ల్యాండింగ్ గేర్‌ను వెనక్కి తీసుకుంటారు. అలా చేయడం వల్ల విమానం ఏరోడైనమిక్ డ్రాగ్ తగ్గి ఎక్కువ ఇంధనం ఖర్చు కాకుండా ఉంటుంది. టేకాఫ్ తర్వాత కూడా ల్యాండింగ్ గేర్ లివర్ డౌన్‌లో ఉందంటే.. అది సాంకేతిక సమస్య అయినా కావచ్చు లేదా పైలెట్ లివర్‌ను మార్చడం మర్చిపోయి అయినా ఉండవచ్చు. అనవసరంగా గేర్‌ను డౌన్‌లో ఉంచడం వల్ల విమానం వేగానికి ఆటంకం కలుగుతుంది, ఫ్యూయల్ ఎక్కువ ఖర్చవుతుంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాద సమయంలో ల్యాండింగ్ గేర్ లివర్ డౌన్‌లోనే ఉందని చెబుతున్నారు. ఇది పైలెట్ మర్చిపోవడం వల్ల జరిగిందా లేదా సాంకేతిక సమస్య కారణం అయి ఉంటుందా అని నిపుణులు పరిశోధిస్తున్నారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత విమానం రెండు ఇంజిన్లు ఒకేసారి శక్తిని కోల్పవడంలో ల్యాండింగ్ గేర్ పాత్ర ఏమైనా ఉందా అనే దిశగా దర్యాఫ్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు
కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి