Medha Patkar: పరువునష్టం కేసులో మేథాపాట్కర్ అరెస్టు
ABN , Publish Date - Apr 25 , 2025 | 02:05 PM
నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై 2000లో వీకే సక్సేనాపై మేథా పాట్కర్ కేసు వేశారు. అప్పట్లో అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్డీఓకు చీఫ్‌గా సక్సేనా ఉన్నారు.

న్యూఢిల్లీ: ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నాటి పరువునష్టం కేసు (Defamation Case)లో సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేథా పాట్కర్ (Medha Patkar)ను ఢిల్లీ పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేసారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) గతంలో ఈ పరువునష్టం కేసు వేశారు. ఏప్రిల్ 23లోగా వ్యక్తిగతంగా ప్రొబేషన్ బాండ్స్ సమర్పించాలని సాకేత్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి విశాల్ సింగ్ ఇచ్చిన ఆదేశాలను ఆమె పాటించకపోవడంతో మేథాపాట్కర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీంతో నిజాముద్దీన్‌లోని నివాసానికి చేరుకున్న పోలీసు అధికారులు ఆమెను అరెస్టు చేశారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ చూపించి మేథాపాట్కర్‌ను అరెస్టు చేసినట్టు సౌత్ ఈస్ట్ డిసీపీ రవి కుమార్ సింగ్ తెలిపారు. సాకేత్ కోర్టు ముందు ఆమెను ఈరోజు హాజరుపరచనున్నారు. ఏఎస్‌జే సింగ్ సెలవుపై ఉండడంతో లింక్ జడ్జి ముందు ఆమెను హాజరుపరుస్తామని అధికారులు చెప్పారు.
Rahul Gandhi: కశ్మీర్‌కు చేరుకున్న రాహుల్.. బాధితుల పరామర్శ
నర్మదా బచావో ఆందోళనకు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై 2000లో వీకే సక్సేనాపై మేథా పాట్కర్ కేసు వేశారు. అప్పట్లో అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్డీఓకు చీఫ్‌గా సక్సేనా ఉన్నారు. మేథాపాట్కర్ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను కించపరచేలా వ్యాఖ్యలు చేశారని, పరువునష్టం కలిగించే ప్రకటన జారీ చేశారని వీకే సక్సేనా ఆరోపిస్తూ రెండు కేసులు దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Pahalgam Attack: ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు
Exercise Aakraman: ఎల్ఓసీ సమీపంలో భారత వాయుసేన 'ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్'
Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్
For National News And Telugu News