BCCI: సిగ్గుసిగ్గు.. బీసీసీఐపై విరుచుకుపడిన ప్రియాంక చతుర్వేది
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:29 PM
జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా పాక్‌పై భారత్ పలు ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో పాల్గొంటుండటంపై శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) తప్పుపట్టారు. బర్మింగ్‌హామ్ వేదికగా భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య ఈనెల 20న మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీకి బీసీసీఐ అనుమతించడంపై చతుర్వేది మండిపడ్డారు. ఇది సిగ్గుచేటని విమర్శించారు. ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తల నడుమ జాతీయ భావోద్వేగాలను పట్టించుకోకపోవడాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆమె నిలదీశారు.
''ఈ చర్య సిగ్గుచేటు. పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని భారత ప్రభుత్వం చెప్పిన మాట ఏమైంది? పహల్గాం ఉగ్రవాదులను పట్టుకోక ముందే పాక్‌తో మ్యాచ్‌లకు అనుమతించాల్సిన అవసరం ఏమొచ్చింది? పహల్గాం ఉగ్రదాడిలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే బీసీసీఐ, ఐసీసీలు తమ డబ్బు గురించి ఆలోచించడం నైతిక దివాళాకోరుతనాన్నే సూచిస్తుంది' అని చతుర్వేది ఘాటుగా విమర్శించారు. చతుర్వేది విమర్శలపై బీసీసీఐ కానీ, మ్యాచ్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు కానీ వెంటనే స్పందించలేదు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా పాక్‌పై భారత్ పలు ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఇవి కూడా చదవండి..
అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా.. రాజకీయాలకూ గుడ్‌బై
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనం వీడాలి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి