Share News

Al Falah University Face Fallout: అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉగ్ర మూలాలు.. 600 మంది విద్యార్థుల జీవితం నాశనం!

ABN , Publish Date - Nov 22 , 2025 | 06:59 AM

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో ప్రధాన నిందితులందరూ హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న వారిగా తేలింది. ఉగ్ర మూలాలు బయటపడ్డంతో దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున యూనివర్సిటీపై దృష్టి సారించాయి. కాలేజీ మూతపడే అవకాశం ఉందన్న ప్రచారం బాగా జరుగుతోంది.

Al Falah University Face Fallout: అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉగ్ర మూలాలు.. 600 మంది విద్యార్థుల జీవితం నాశనం!
Al Falah University Face Fallout

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర నవంబర్ 10వ తేదీన కారు బాంబు బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 13 మంది మరణించగా.. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాంబు బ్లాస్ట్‌ కేసులో ప్రధాన నిందితులందరూ హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న వారిగా తేలింది. ఈ నేపథ్యంలోనే అల్ ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేశారు. యూనివర్సిటీకి వస్తున్న ఫండ్స్, బ్యాంకు ఖాతాలపై ఈడీ చర్యలు చేపట్టింది.


600 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం..

అల్ ఫలాహ్ యూనివర్సిటీలో దాదాపు 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. అల్ ఫలాహ్‌లో ఉగ్ర మూలాలు బయటపడ్డంతో దర్యాప్తు సంస్థలు పెద్ద ఎత్తున యూనివర్సిటీపై దృష్టి సారించాయి. కాలేజీ మూతపడే అవకాశం ఉందన్న ప్రచారం బాగా జరుగుతోంది. ఆ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక అల్లాడిపోతున్నారు. దీనిపై యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి ఒకరు మాట్లాడుతూ.. ‘మా యూనివర్సిటీని టెర్రర్ డెన్ అని పిలుస్తూ ఉన్నారు.


కొంతమంది ఈ యూనివర్సిటీని పునాదులతో సహా కూలగొట్టాలని అంటున్నారు. కానీ, వందల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటి? కెరీర్‌ను మలుచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. రేపు కాలేజీని మూసేస్తే .. ఐదేళ్ల నీట్ కష్టాలు, లక్షల రూపాయల డబ్బు వృథా అయిపోతాయి. మా బ్యాచ్ విద్యార్థులను హాస్పిటల్‌లలో నమ్మే పరిస్థితి కనిపించటం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పరీక్షలు ముగియటంతో విద్యార్థులంతా ఇళ్ల బాట పట్టారు. తమ పేరు, ఐడెంటిటీ చెప్పకుండా మీడియాతో తమ బాధను పంచుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి

సోషల్‌ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు

దేవ్‌జీ, రాజిరెడ్డి పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాల్లేవు

Updated Date - Nov 22 , 2025 | 07:07 AM