Pilgrim Deaths Kanwar Yatra: కావడి యాత్రలో ఆరుగురు యాత్రికుల మృతి
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:57 AM
కావడి యాత్రలో భక్తుల రద్దీ పెరగడంతో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు భక్తులు మరణించారు.

టికెట్ అడిగినందుకు ఓ సీఆర్‌పీఎఫ్ జవానుపై యాత్రికుల దాడి
ముజఫరాబాద్/హరిద్వార్, జూలై 20: కావడి యాత్రలో భక్తుల రద్దీ పెరగడంతో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు భక్తులు మరణించారు. ఇరవైకి పైగా భక్తులు గాయపడ్డారు. యాత్ర 23న ముగుస్తుండడంతో యాత్రలో ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాత్ర ప్రధాన మార్గాలైన ఢిల్లీ- డెహ్రాడూన్ రహదారి, గంగా కాలువ రోడ్డు భక్తులతో నిండిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి పవిత్ర గంగా జలాలతో వస్తున్న వేల మంది భక్తులకు ముజఫరాబాద్‌లో యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించి ఆహ్వానించారు. కావడి యాత్రకు అప్రతిష్ఠపాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మీర్జాపుర్ రైల్వేస్టేషన్‌లో ఓ సీఆర్‌పీఎఫ్ జవానుపై కావడి యాత్రికులు దాడి చేశారు. బ్రహ్మపుత్ర రైలు ఎక్కిన యాత్రికులను జవాను టికెట్ అడగడంతో వారు అతడిపై దాడికి పాల్పడ్డారు. ప్లాట్‌ఫారంపై పడిపోయిన జవానుపై ప్రయాణికులందరి ముందే పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రైల్వే భద్రత దళం (ఆర్పీఎఫ్) సిబ్బంది వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో ఢిల్లీ-హరిద్వార్ జాతీయ రహదారిపై అకారణంగా గొడవలకు దిగి రోడ్డును బారికేడ్లతో మూసివేసిన రెండు వేరు వేరు ఘటనల్లో నలుగురు కావడి యాత్రికులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News