52 ఏళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:34 PM
ఇంద్రావతి అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి చంద్రశేఖర్‌ను చంపాలనుకున్నారు. అది కుదరకపోవటంతో ఇళ్లు వదలి పారిపోయారు.

ఈ మధ్యకాలంలో మతిపోగొట్టే వింత విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ మహిళ తన కూతురికి కాబోయే భర్తతో ఇంటినుంచి పారిపోయింది. పెళ్లికి 10 రోజుల ముందు కాబోయే అల్లుడితో లేచిపోయింది. ఈ సంఘటన మరువక ముందే మరో కొత్త, వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 52 ఏళ్ల మహిళ.. 25 ఏళ్ల యువకుడితో ఇంటినుంచి పారిపోయింది. అతడ్నే పెళ్లి కూడా చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, బస్కారీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన చంద్రశేఖర్, ఇంద్రావతి భార్యాభర్తలు.
ఈ దంపతులు బేల్‌వారీ దలిత్ బస్తీలో ఉంటున్నారు. ఈ జంటకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. చంద్రశేఖర్ వేరే సిటీలో పని చేస్తూ ఉన్నాడు. కుటుంబం అవసరాల కోసం డబ్బులు పంపుతూ ఉంటాడు. పదిరోజుల క్రితం ఇంద్రావతి ఇంటినుంచి కనిపించకుండా పోయింది. చంద్రశేఖర్ ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. ఇంద్రావతి అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి చంద్రశేఖర్‌ను చంపాలనుకున్నారు. అది కుదరకపోవటంతో ఇళ్లు వదలి పారిపోయారు. ఈ విషయంపై ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘ ఇద్రావతికి ఇది మూడో పెళ్లి.. నేను రెండో భర్తను.
మొదటి భర్తతో విడిపోయి వేరుగా ఉంటున్న ఆమెను నేను పెళ్లి చేసుకున్నా. అప్పటికే ఆమెకు ఓ కూతురు ఉంది. నాతో పెళ్లయిన తర్వాత ఓ కూతురు, ఇద్దరు కొడుకులు పుట్టారు. నా పొలాన్ని తాకట్టు పెట్టి ఇంద్రావతి మొదటి భర్త కూతురికి పెళ్లి చేశాను. నా మీద ఆమెకు ఆసక్తి తగ్గిపోయింది. నాతో సరిగా మాట్లాడేది కాదు. ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేది. ఇంద్రావతి, ఆమె ప్రియుడు నన్ను చంపాలనుకున్నారు. కానీ, అది జరగలేదు. అందుకే ఇంటినుంచి పారిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాళ్లు చేతులు ఎత్తేశారు. ఆ ఇద్దరూ సిగ్గులేకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. నా దృష్టిలో తను చనిపోయింది. నా పొలం డబ్బులు నాకు ఇచ్చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి
Viral Video: ఫ్రిజ్ తెరిచిచూసి షాక్.. లోపల బుసలు కొడుతూ నాగరాజు..