Share News

plane crash Deaths: విమాన ప్రమాదంలో మృతుల అధికారిక లెక్క

ABN , Publish Date - Jun 24 , 2025 | 10:26 PM

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా, 34 మంది విమానం దూసుకెళ్లిన చోట..

plane crash Deaths: విమాన ప్రమాదంలో మృతుల అధికారిక లెక్క
plane crash Deaths

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా, 34 మంది విమానం పడిన చోట ఉన్నారని గుజరాత్ ఆరోగ్య శాఖ ఈరోజు తెలిపింది. ఈ ప్రమాద మృతులకు సంబంధించి ఇది మొదటిసారి అధికారిక సంఖ్య. జూన్ 12న లండన్‌కు వెళ్లే విమానం కూలిపోయినప్పటి నుండి, మొత్తం మరణాల సంఖ్య గురించి అధికారిక ప్రకటన రాలేదు. DNA నమూనాలు సరిపోయిన తర్వాతే మృతుల సంఖ్యను ప్రకటిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రమాద సమయంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అధికారికంగా చెప్పిన ప్రకటనలో ప్రభుత్వం.. అన్ని మృతదేహాలను ఇప్పుడు వెలికితీశామని, ఇప్పటివరకు 260 మృతదేహాలను DNA నమూనా ద్వారా, ఆరు ముఖ గుర్తింపు ద్వారా గుర్తించామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

మరణించిన వారిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు 256 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. మిగిలిన మృతదేహాల DNA గుర్తింపు ఇంకా కొనసాగుతోంది.

లండన్‌కు వెళ్తున్న బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కిందికి దిగిపోతూ విమానాశ్రయానికి దగ్గర్లోని మేఘని నగర్‌ బిజె మెడికల్ కాలేజీ నివాస భవనంలోకి దూసుకెళ్లింది. విమానంలో ఉన్న 242 మందిలో ఒక్క ప్రయాణీకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న బ్రిటిష్ ఇండియన్ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.


కాగా, ఈ ప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదు. విమానం బ్లాక్ బాక్స్‌ను నిఫుణులు పరిశీలిస్తున్నారు. బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నదని, డేటా వెలికితీత కోసం విదేశాలకు పంపవచ్చని వచ్చిన మీడియా రిపోర్టుల గురించి అడిగినప్పుడు, పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అవన్నీ ఊహాగానేలేనని చెప్పారు. బ్లాక్ బాక్స్ ఇండియాలోనే ఉందని, ప్రస్తుతం దీనిని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో లేదా AAIB పరిశీలిస్తోందని తెలిపారు.

ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా పలు తక్షణ చర్యలకు ఉపక్రమించింది. అంతర్జాతీయ విమానాల కోసం వైడ్-బాడీ విమానాల వాడకాన్ని 15 శాతం తగ్గించింది. దీంతో పాటు అనేక భద్రత, ప్రమాద నివారణ చర్యలను చేపట్టింది. ఈ చర్యలు జూన్ 20 నుండి జూలై మధ్య వరకు కొనసాగుతాయి.


ఒప్పందాన్ని ఉల్లంఘించ వద్దు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.. ఇరాన్ కీలక ప్రకటన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 10:26 PM