Chhattisgarh: 22 మంది మావోయిస్టులు లొంగుబాటు
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:17 PM
హింసను వీడి ప్రగతి, ఐక్యతా మర్గాన్ని ఎంచుకుంటూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. లొంగిపోయిన 22 మంది నక్సలైట్లపై రూ.37.5 లక్షల రివార్డు ఉందని చెప్పారు.

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని నారాయణపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులు శుక్రవారంనాడు లొంగిపోయారు. అబూజ్‌మడ్ ప్రాంతల్లో చురుకుగా ఉన్న వీరంతా నారాయణపూర్ ఎస్పీ రాబిన్‌సన్ గిరియా, సీనియర్ పోలీసు అధికారుల సమక్షంలో లొంగిపోయారు. వీరిలో 14 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. వీరిలో ఒక జంట కూడా ఉంది. కుతుల్, ఆమ్‌దయీ ఏరియా కమిటీలకు చెందిన ఈ సభ్యులు బస్తర్ ప్రాంతంలోని అటవీ జోన్లలో చిరకాలంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.37 లక్షల రివార్డు ఉంది.
స్వాగతించిన సీఎం
హింసను వీడి ప్రగతి మర్గాన్ని ఎంచుకుంటూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. లొంగిపోయిన 22 మంది నక్సలైట్లపై రూ.37.5 లక్షల రివార్డు ఉందని చెప్పారు. వీరిలో రూ.50,000 నుంచి రూ.8 లక్షల వరకూ రివార్డు ఉన్న వారున్నారని చెప్పారు. వీరంతా ఇప్పుడు మిలిటెన్సీకి దూరంగా జనజీవన స్రవంతిలోకి వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఇంతవరకూ 1,476 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయారని, 2025లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పునరావాస విధానం, సంక్షేమ చర్యలతో గిరిజనుల్లో విశ్వాసాన్ని చూరగొన్నామని చెప్పారు. ప్రజలకు సాధికారత కల్పించి అభివృద్ధికి బాటలు వేయడం ద్వారా వీరంతా తిరిగి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని చెప్పారు. శాంతి పథాన్ని ఎన్నుకున్న వారి జీవితాలను బాగుచేసేందుకు తమ ప్రభుత్వ కట్టుబడి ఉందన్నారు. 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని నిర్మూలించేందుకు తామంతా దృఢ సంకల్పంతో ఉన్నట్టు చెప్పారు.
మోదీ రిటైర్మెంట్ గురించే ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలంటూ కాంగ్రెస్ పోస్టు
భారత్‌కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి.. అజిత్ డోభాల్ సవాల్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి