Share News

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తానీలు.. వారి గురించి చెబితే 20 లక్షల రివార్డ్

ABN , Publish Date - Apr 24 , 2025 | 03:37 PM

Pahalgam Terror Attack: అనంత్‌నాగ్ పోలీసులు పహల్గామ్‌లో పర్యాటకులపై దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అనుమానితుల చిత్రాలను విడుదల చేశారు. వీరిలో ఇద్దరిని పాకిస్తాన్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తానీలు.. వారి గురించి చెబితే 20 లక్షల రివార్డ్
Pahalgam Terror Attack

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దాడిలో పాల్గొన్నారని అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తుల చిత్రాలను అనంత్ నాగ్ పోలీస్ శాఖ గురువారం విడుదల చేసింది. పోలీసుల నోటీస్ ప్రకారం.. ముగ్గరు అనుమానితుల్లో హసీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలి భాయ్ అలియాస్ తల్హా భాయ్ ఇద్దరూ పాకిస్తాన్‌కు చెందిన వారు. మూడో వ్యక్తి అబ్దుల్ హుస్సేన్ థోకర్‌ది జమ్మూకాశ్మీర్ జిల్లాలోని అనంత్‌నాగ్ జిల్లా. ఈ ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కర ఈ తోయిబాకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఆ ఇద్దరు అనుమానితుల గురించి సరైన సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షల రూపాయలు రివార్డు ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది.


ఇక, మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది చనిపోయారు. వీరిలో 25 మంది ఇండియాకు చెందిన వారు కాగా.. మిగిలిన ఒక వ్యక్తి నేపాల్‌కు చెందినవాడు. ఉగ్రవాడిలో మరణించిన 26 మంది మృతదేహాలు పోలీస్ ఫార్మాలిటీస్ తర్వాత సొంతూళ్లకు పంపేశారు. గురువారం పలువురి అంత్యక్రియలు జరిగాయి. చనిపోయిన 26 మందిలో నెల్లూరులోని కావలికి చెందిన మధుసూదన్ రావు కూడా ఉన్నారు. మధుసూదన్ రావు కుటుంబాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. మధుసూదన్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.


ప్రధాని మోదీ ఉగ్రరూపం

పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. దాయాది దేశం పాకిస్తాన్‌పై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. బీహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నమోదీ ఉగ్రవాదులకు, ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న వారికి హెచ్చరికలు జారీచేశారు. ‘ ప్రతీ ఒక్క ఉగ్రవాదిని, వారిని ప్రోత్సహిస్తున్న వారిని భారత్ గుర్తిస్తుంది. పట్టుకుని శిక్షిస్తుంది. వారిని భూమి అంచుల వరకు తరుముతాము. ఉగ్రవాదాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని తేల్చి చెప్పారు. ఇక, పాకిస్తాన్‌తో సంబంధాలకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్‌కు సింధు జలాల నీటి సరఫరాను నిలిపివేసింది. పాకిస్తాన్ టు ఇండియా రాకపోకలను కూడా నిలిపివేసింది. పాకిస్తాన్ వీసాతో ఇండియాలో ఉంటున్న వారిని రెండు రోజుల్లో వెళ్లిపొమ్మని ఆదేశించింది.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. అవే రక్తపు బట్టలతో అంత్యక్రియలకు కూతురు..

Tirumala High Alert: పహల్గామ్ దాడితో తిరుమలలో అలర్ట్

Updated Date - Apr 24 , 2025 | 03:41 PM